Kadem | అల‌రించిన రంగ‌వ‌ల్లులు

Kadem | అల‌రించిన రంగ‌వ‌ల్లులు

  • ధర్మాజీపేట్ గ్రామంలో ఘనంగా ముగ్గుల పోటీలు
  • విజేతలకు బహుమతులు అందజేసిన సర్పంచ్

Kadem | కడెం, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కడెం మండలం ధర్మాజీపేట్ గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గ్రామ సర్పంచ్ ఒడ్నాల శిరీష సత్యం, ఉప సర్పంచ్ ధీసు లింబన్న, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గెలుపొందిన విజేతలను ఆర్ఐ శారద ఎంపిక చేశారు. విజేతలకు సర్పంచ్ శిరీష సత్యం చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. మొదటి బహుమతి అమరగొండ మౌనిక, రెండో బహుమతి మూల శ్వేత, మూడో బహుమతిగా బాండ్రా హేమలత గెలుచుకున్నారు.

Leave a Reply