Kabaddi | పెదగౌడ పాలెంలో కబడ్డీ పోటీలు

Kabaddi | నాగాయలంక, ఆంధ్రప్రభ : మండలం పర్రచివర శివారు పంచాయతీ పెదగౌడ పాలెం గ్రామంలో సంక్రాంతి సందర్భంగా కబడ్డీ పోటీలు నిర్వహించారు. రిటైర్ టీచర్ మోర్ల వెంకటేశ్వరరావు, గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఈ కబడ్డీ పోటీలు నియోజకవర్గ స్థాయిలో జరుగగా విద్యార్థులు పాల్గొని ఆడారు.

విన్నర్స్ గా తలగడదీవి హై స్కూల్ విద్యార్థులు, రన్నర్స్ గా కోడూరు మండలం స్వతంత్రపురానికి చెందిన విద్యార్థులు నిలిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్సై కె రాజేష్, రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్, గ్రామ పెద్దలు కబడ్డీ ఆటల లో గెలుపొందిన విద్యార్థులకు శాలువాతో సత్కరించి నగదు బహుమతులు అందజేసారు.

వారందరిని అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఆటలలో గెలుపొందిన వారిని స్ఫూర్తిగా తీసుకుని చదువుకునే విద్యార్థులందరూ కూడా ఆటల పోటీల్లో బాగా రాణించాలన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా విద్యార్థుల దశనుండే ఆటపాటల్లో కూడా రాణిస్తే ఉపాధి అవకాశాలు త్వరగా పొందుతారని వారు తెలిపారు.

Leave a Reply