తిరుమల : టీటీడీ ముఖ్య నిఘా, భద్రతాధికారిగా కే.వీ.మురళీకృష్ణ గురువారం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. ముందుగా శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సీవీఎస్వో రంగనాయకులు మండపంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు సీవీఎస్వోకు తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు సీవీఎస్వో వెంకట శివకుమార్ రెడ్డి, వీజీవోలు రామ్ కుమార్, సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.
TTD | సీవీఎస్వోగా కే.వీ.మురళీకృష్ణ బాధ్యతల స్వీకరణ
