ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి

మెండోరా, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో సర్పంచ్ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి వేడుకలు నిర్వహించారు.ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బుట్టడి ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. అంటరానితనం, కుల వివక్ష నిర్మూలనకు,మహిళా విద్యకు పూలే చేసిన కృషి ఎనలేనిదని వక్తలు కొనియాడారు. సమాజ మార్పునకు ఆయన బాటలో పాయనించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మిట్టపల్లి రాజేశ్వర్,వార్డు మెంబర్ శ్రీనివాస్,శంకర్ పంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్, కరోబర్ చిరంజీవి, కంప్యూటర్ ఆపరేటర్ రాకేష్,శ్రీనివాస్,మహేశ్,బెనర్జీ,నారాయణా, సదానంద్, తదితరులు పాల్గొన్నారు.
