మహిళా అక్షరాస్యతకు జ్యోతిబా పూలే ఎనలేని కృషి

మహిళా అక్షరాస్యతకు జ్యోతిబా పూలే ఎనలేని కృషి

  • అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా

నిజామాబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : మహిళా అక్షరాస్యతకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి జ్యోతిబా పూలే అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారా యణ గుప్తా అన్నారు. జ్యోతి బా పూలే జయంతిని పురస్కరించుకొని శనివారం జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లో గల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… మహిళల కోసం సతీ మణి సావిత్రి భాయి పూలే తో కలిసి మొట్ట మొదటి పాఠశాలను నెలకొల్పిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.

సమాజంలో సమానత్వం, విద్య, న్యాయం కోసం జీవి తాన్ని అంకితం చేసిన మహాయోధుడు అని తెలిపారు. ప్రధానంగా మహిళల విద్యకు ఆయన చేసిన సేవలు అపూర్వమైనవని పేర్కొన్నారు. అణగారి న వర్గాలకు న్యాయం చేయాలని లక్ష్యంతో సత్యశోధ కు సమాజా న్ని స్థాపించారని గుర్తు చేశారు. ఒక మహాను భావుడిని గుర్తు చేసు కోవడం మాత్రమే కాద ని, ఆయన చూపిన మార్గాన్ని అనుసరించ డం అందరి బాధ్యత అన్నారు.

ప్రధాని మోదీ కూడా మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజ ర్వేషన్ కల్పించార ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ కల్పి స్తామని చెప్పి ప్రజలను మభ్యపెడు తుందన్నా రు. ఇప్పటివరకు ఎ లాంటి ప్రణాళిక రూ పొందించకుండా మో సం చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామి యాదవ్, కా ర్పొరేటర్లు జ్యోతి ముర ళి, మల్లేష్ యాదవ్, బెల్లాల్ శశాంక్, జగదీష్ కులకర్ణి, బంటు ప్రీతి ప్రవీణ్, శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.

Leave a Reply