నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తుకు పునాదులు..

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సతీమణి అర్చనతో కలిసి కౌలాస్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి స్వయంగా షూ,సాక్స్ కాళ్లకు తొడిగించి విద్యార్థులపై ఉన్న తమ ప్రేమ, మమకారాన్ని చాటుకున్నారు. జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామంలోని హైస్కూల్, ప్రాథమికోన్నత పాఠశాలలో 250 మంది విద్యార్థులకు సతీమణి తోట అర్చనతో పాటు డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ తో కలిసి షూలు, సాక్స్ లు పంపిణీ చేశారు. నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు అని ఎమ్మెల్యే తోట కొనియాడారు.

విద్యార్థి దశ జీవితంలో తిరిగిరాదని కాబట్టి ప్రతి విద్యార్థి శ్రద్ధగా పై చదువులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు తమవంతు కృషి చేయడం జరుగుతుందని, విద్యాభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుందని ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులతో పాటు కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు గంగారెడ్డి, కాంగ్రెస్ యువ నాయకుడు పాకలవెంకటేష్ ఇరు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు యాదగిరి, రాజవర్ధన్ తోపాటు గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply