Maha kumbh stampede | తొక్కిసలాటపై జ్యుడీషియల్ కమిటీ
మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ముగ్గురు సభ్యులతో న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. జస్టిస్ హర్ష్ కుమార్ నేతృత్వంలోని కమిషన్ విచారణ చేపట్టనుంది. మాజీ డీజీ వీకే గుప్తా, రిటైర్డ్ ఐఏఎస్ డీకే సింగ్ సభ్యులుగా ఉంటారని సీఎం తెలిపారు.
తొక్కిసలాటలో 30 మంది మరణించారని, 36 మంది గాయపడ్డారని యూపీ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు తెలిపారు. సీఎం కంట్రోల్ రూమ్, చీఫ్ సెక్రటరీ కంట్రోల్ రూమ్, డిజిపి కంట్రోల్ రూమ్‌లలో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, తీసుకోవాల్సిన చర్యలపై వరుస సమావేశాలు నిర్వహించి సంబంధిత అధికారులకు నోటీసులు ఇచ్చామని చెప్పారు.