Judgement Day : క్షణ క్షణం మారి పోతున్న లీడ్స్ – కేజ్రీవాల్, సిసోడియా ముందంజ

న్యూ ఢిల్లీ : దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు అనుగుణంగానే ఫలితాల సరళి కన్పిస్తున్నప్పటికీ.. ఆధిక్యాల్లో బీజేపీ-ఆప్‌ మధ్య హోరాహోరీ పోటీ కన్పిస్తోంది.

ఉదయం 10 .30 గంటల వరకు వెలువడిన ఫలితాలను చూస్తుంటే.. ఆధిక్యాల్లో బీజేపీ మ్యాజిక్‌ ఫిగర్‌ (36)ను దాటింది. ప్రస్తుతం కమలం పార్టీ 39 స్థానాల్లో ముందంజలో ఉండగా.. ఆప్‌ 31 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్‌ తొలుత ఒక చోట ముందంజలో ఉన్నట్లే కన్పించినా.. ఆ తర్వాత వెనుకంజలోకి పడిపోయింది. ఏ స్థానంలోనూ హస్తం పార్టీ ప్రభావం చూపలేకపోయింది.

ఇక అప్, బీజేపీ అభ్యర్థుల మధ్య లీడ్ కేవలం వెయ్యి ఓట్లు మాత్రమే ఉండటం తో లీడ్స్ క్షణ క్షణం మారి పోతున్నాయి

ప్రముఖుల ఫలితాల సరళి ఎలా ఉందంటే..

న్యూదిల్లీ అసెంబ్లీ స్థానంలో ఆప్‌ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ ముందంజలోకి వచ్చారు. తన సమీప భాజపా అభ్యర్థి పర్‌వేశ్‌ సాహిబ్‌ సింగ్‌ వర్మపై ఆధిక్యంలోకి వచ్చారు.

కాల్‌కాజీ స్థానంలో దిల్లీ సీఎం ఆతిశీ వెనుకంజ

జంగ్‌పురలో మనీశ్ సిసోదియా ముందంజ

షాకుర్‌ బస్తీలో ఆప్‌ అభ్యర్థి సత్యేంద్ర కుమార్‌ జైన్‌ ముందంజ

ఓక్లా స్థానంలో ఆప్‌ అభ్యర్థి అమానుతుల్లా ఖాన్‌ ముందంజ

గాంధీనగర్‌లో భాజపా అభ్యర్థి అర్విందర్‌ సింగ్‌ లవ్లీ ముందంజ

బద్లీ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి దేవేంద్ర యాదవ్‌ వెనుకంజ.. తొలి రౌండ్లలో ఆయన ఆధిక్యంలో కన్పించారు.బిజ్వాసన్‌

స్థానంలో భాజపా అభ్యర్థి కైలాష్‌ గహ్లోత్‌ ముందంజప

త్‌పర్‌గంజ్‌లో ఆప్‌ అభ్యర్థి అవధ్‌ ఓజా వెనుకంజ

గ్రేటర్‌ కైలాష్‌లో ఆప్‌ అభ్యర్థి సౌరభ్‌ భరద్వాజ్‌ ముందంజ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *