Jubilee Hills | నవీన్ ఇంటివద్ద సంబురాలు

Jubilee Hills | నవీన్ ఇంటివద్ద సంబురాలు
పెద్దసంఖ్యలో చేరిన కాంగ్రెస్ నేతలు
Jubilee Hills | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో స్పష్టమైన మెజార్టీ కనిపించడంతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్(Naveen Kumar Yadav) ఇంటి వద్ద సంబురాలు ప్రారంభమయ్యాయి. యూసఫ్‌గుడలో జూబ్లీహిల్స్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
ఎనిమిదో రౌండ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ 21,495 ఓట్లు ఆధిక్యం(leading by 21,495 votes)లో ఉన్నారు. దాదాపు అన్ని రౌండ్లలోనూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ముందంజలో ఉన్నారు. ఇంకా దూసుకుపోయే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భావించి జూబ్లిహిల్స్ లో నవీన్ యాదవ్ ఇంటివద్ద, పార్టీ ఆఫీసు వద్ద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఇంటివద్దకు భారీగా కాంగ్రెస్ శ్రేణులు చేరుకుంటున్నారు. నవీన్ యాదవ్ ఇంటివద్ద అప్పుడే బాణాసంచా కాలుస్తూ.. సందడి చేస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకెళుతోంది. కాంగ్రెస్ గెలుపు(Congress win) దాదాపు ఖాయం కావడంతో గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబురాలు నిర్వహించాయి. పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని బాణసంచా కాల్చారు. పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు.

