ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక..

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూరు మున్సిపాలిటీలో బుజిలాపురం 5వ వార్డు లో ఇండిపెండెంట్ గా గెలిచిన కౌన్సిలర్ మొగుళ్ళ అనురాధ శ్రీనివాస్ రెడ్డి ఆదివారం జిల్లా కాంగ్రెస్ నాయకులు డా గుర్రం లక్ష్మీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఎమ్మెల్యే సామెల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనూరాధ కి స్వయంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.ఆమెతోపాటు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చుక్క వెంకన్న పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చింతల రాజిరెడ్డి ,చింతల సందీప్ రెడ్డి, మహమ్మద్ అస్లాం తదితరులు పాల్గొన్నారు.
