TG |ఎర్రవల్లిలో మొక్కలు నాటిన జోగినపల్లి సంతోష్ కుమార్

గజ్వేల్, జూన్ 4 (ఆంధ్ర ప్రభ) : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో గురువారం మాజీ రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ మొక్కలు నాటారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా త‌న బాధ్య‌త‌గా తానూ మూడు మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణ మనంద‌రి బాధ్యత అన్నారు. మొక్కలు నాటడమే కాదు.. వాటిని రక్షించే బాధ్య‌త‌ చేపట్టాలన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేనలో భాగంగా మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు, ప్రముఖ సినీ హీరో చిరంజీవి, పద్మశ్రీ అవార్డు గ్రహిత జాదవ్ పయాంగ్ లను మొక్కలు నాటాలని కోరారు. అనంతరం అందరికి ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply