jobs | సాంకేతికత అవసరం…

jobs | సాంకేతికత అవసరం…

jobs | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కృత్రిమ మేథస్సు (ఏఐ) ప్రభావంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ వల్ల భవిష్యత్తులో అనేక ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందన్నారు. విజయవాడలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో నిర్వహించిన పూర్వవిద్యార్థుల సంఘం స్వర్ణోత్సవ సంబరాల్లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. మానవ సంబంధాలు దెబ్బతినకూడదని, విలువలతో కూడిన సాంకేతికత అవసరమని సూచించారు. వైట్‌కాలర్ ఉద్యోగాలు కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తెలుగు భాష, సంస్కృతిని భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. తనకు కృత్రిమ మేథస్సు లేదన్నారు. ఏఐ ఉండకూడదని తాను చెప్పను కానీ.. దానివల్ల వైట్ కాలర్ జాబ్స్ పోకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

విలువలతో కూడిన కృత్రిమ మేథస్సును అందించాలని సూచించారు. భవిష్యత్తులో అనేక రంగాల్లో చాలా ఉద్యోగాలు పోతాయని, దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని , మన కట్టు.. బొట్టులకు ప్రాధాన్యమివ్వాలని తెలిపారు. కులం కన్నా గుణం మిన్న అని పెద్దలు ఊరికే చెప్పలేదని, డిగ్రీల కంటే పరిజ్ఞానమే ముఖ్యమన్నారు.

Leave a Reply