జిల్లా ఉపాధి అధికారిణి ఎన్. మాధవి
ఖమ్మం : ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించుటకు ఈనెల 6న గురువారం ఉదయం 10.00 గంటలకు మోడల్ కెరీర్ సెంటర్ (ప్రభుత్వ ఐటిఐ టేకులపల్లి) ఖమ్మం నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి ఎన్.మాధవి ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ లోని వై.ఎస్.కె. ఇన్ఫో టెక్ ప్రైవేటు లిమిటెడ్ లో అసెంబ్లింగ్ ఆపరేటర్, టెక్నికల్ టీమ్ సపోర్ట్, క్వాలిటీ చెకర్స్ ఖాళీల కోసం ఎస్.ఎస్.సి. ఐ.టి.ఐ. ఏదేని డిగ్రీ పాస్, ఫెయిల్ అర్హత గల వారు దరఖాస్తు చేసుకోవాలని ఎంపికైన వారికి వేతనం 16 వేలు ఉంటుందన్నారు.
అలాగే హైదరాబాద్ లోని జిజే సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీల కోసం ఏదేని డిగ్రీ అర్హత కలవారు దరఖాస్తు చేసుకోవాలని, వేతనం రూ.13 వేలు ఉంటుందన్నారు. మొత్తం 500 ఉద్యోగ ఖాళీల భర్తీకి గానూ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు 18 నుండి 30 సంవత్సరాల వయస్సు గల యువతీ యువకులు అర్హులని, తమ విద్యార్హతల సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలతో జాబ్ మేళాకు హాజరు కావాలని జిల్లా ఉపాధి అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.