JN.1 Variant : దేశంలోకి కరోనా కొత్త వేరియంట్ : ముందు జాగ్రత్తలు అవసరం అంటున్న వైద్యులు

న్యూ ఢిల్లీ : దేశంలో మరోసారి కరోనా విస్తరిస్తోంది. కొత్త వెరియంట్లు  NB.1.81, LF.7లను గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలలో గుర్తించినట్లు ఇండియన్ సార్స్ కోవ్ 2 జినోమిక్స్ కన్సార్టియమ్ వెల్లడించింది. ఈ వెరియంట్ల వ్యాప్తి ప్రస్తుతం సింగపూర్ లో అధికంగా ఉంది.తాజాగా కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు నమోదవుతున్నాయి.

ఇటీవలే సింగపూర్‌, హాంకాంగ్‌లో కేసులు నమోదు కాగా.. తాజాగా భారత్‌లో కూడా ఈ కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా ముంబై, చెన్నై, కర్ణాటక, అహ్మదాబాద్‌ నగరాల్లో కేసులు నమోదవుతున్నాయి.

ప్రస్తుతం మహారాష్ట్రంలో 45, కర్నాటకలో 35, ఢిల్లీలో 27 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి.దేశంలో మరోసారి కరోనా మహమ్మారి కలవరం సృష్టిస్తోంది. తాజాగా కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు నమోదవుతున్నాయి. వీటితో పాటు ఎల్ఎఫ్.7, ఎన్బీ.1.5 అనే వేరియంట్స్‌ కూడా వ్యాప్తి చెందుతున్నట్టు కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం భారత్‌లోని ముంబై, చెన్నై, అహ్మదాబాద్ వంటి నగరాల్లో ఈ కరోనా కొత్త వేరియంట్‌ కేసులు పెరుగుతున్నట్లు సమాచారం.

ఈ కరోనా కొత్త వేరియంట్‌ పెరుగుదలకు ప్రధాన కారణాలు చూసుకుంటే ప్రజల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం, ఈ కొత్త వెరియంట్‌కు అధిక వ్యాప్తి సామర్థ్యం కలిగి ఉండటం. ఈ రెండు కారణాల వల్ల ఈ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి.

ఈ కరోనా కొత్త వేరియంట్‌ లక్షణాలనాలు కూడా ఇంతకుముందు వచ్చిన ఒమిక్రాన్ లక్షణాల మాదిరే ఉన్నాయి. ప్రధానంగా గొంతు నొప్పి, దగ్గు, అలసట, జ్వరం వంటి లక్షణాలుగా కనిపిస్తాయి. అయితే, ఇంతకు ముందు కరోలా లక్షణాలైన రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు ఈ కొత్త వేరియంట్లలో అంతలా గా కనిపించట్లేదని వైద్యులు చెబుతున్నారు.

అయితే ఈకొత్త వేరియంట్‌ ప్రధానంగా శ్వాసకోశపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇకి కూడా సీజనల్ ఫ్లూ వ్యాదుల మాదిరే వస్తూ పోతూ ఉంటాయని.. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటే ఇది మనపై ఎక్కువ ప్రభావం చూపదని చెబుతున్నారు.

మాస్క్ తోనే….

అయితే ప్రజలు ఈ కొత్త వేరియంట్ల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తులు తీసుకోవడం ముఖ్యం అంటున్నారు వైద్య నిపుణులు ముఖ్యంగా, రద్దీ ప్రదేశాలు, ఇండోర్ ప్రదేశాల్లో మాస్కులు పెట్టుకోవడం, చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం, సానీటైజర్లు వాడటం వంటివి పాటించాలంటున్నారు. అనారోగ్యంగా అనిపిస్తే కచ్చితంగా వైద్య సలహా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే అనారోగ్యంతో ఉన్నవారు, వృద్ధులు ఉంటే బూస్టర్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Reply