18 మందికి లాఠీ దెబ్బలు… ఎందుకంటే

18 మందికి లాఠీ దెబ్బలు… ఎందుకంటే

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పైన కనిపిస్తున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో 18 మందిని పోలీసులు పబ్లిక్‌గా చితకబాదారు. నేర ప్రవృతి కలిగిన వీరికి పబ్లీక్ గా బుద్ధి చెప్పారు. ఆసలు ఏం జరిగింది. గుజరాత్‌లోని పటాన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మార్చి 15న చనస్మా నగరంలో కొంత మంది దుండగులు ఆలయ విరాళాల వివాదం కారణంగా హింసకు పాల్పడ్డారు. ఝిలియా ముఠా’కు చెందిన వ్యక్తులు పదునైన ఆయుధాలతో స్థానికులపై దాడి చేశారు. పోలీసులను కూడా వారు లక్ష్యంగా చేసుకొవడంతో వారు అక్కడ నుంచి పారిపోయారు.


హింసకు పాల్పడిన 18 మంది నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నేర దృశ్య పునఃసృష్టి కోసం వారిని ఆ ప్రాంతానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా నిందితులు భీభత్సం సృష్టించిన మాదిరిగా పోలీసులు బహిరంగంగా వారిని లాఠీలతో చితక్కొట్టారు. వీధి న్యాయం పేరుతో వారికి గుణపాఠం చెప్పారు. అయితే ప్రధాన నిందితులు ఇంకా పరారీలో ఉన్నారని పోలీస్‌ అధికారి తెలిపారు. పారిపోయిన ఎనిమిది మంది పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కాగా ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ ఆయ్యింది.

Leave a Reply