రేవంత్ కన్నా కేసీఆర్ పాలన బాగుంది…

రేవంత్ కన్నా కేసీఆర్ పాలన బాగుంది…

కాంగ్రెస్ పాలన పై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే

జగిత్యాల, ఆంధ్రప్రభ : ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన కంటే బిఆర్ఎస్ ప్రభుత్వ పాలన కెసిఆర్ బాగా పనిచేశారని మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం జగిత్యాలకు కేటీఆర్ వస్తున్న సందర్భంలో మాట్లాడుతూ రెండేళ్ల కాంగ్రెస్ పాలన అధ్వానంగా తయారైందని కాంగ్రెస్తో పోలిస్తే బిఆర్ఎస్ పాలన చాలా బాగుందన్నారు.

పదేళ్లు కెసిఆర్ పాలన చూశాక మెరుగైన పాలన అందుతుందని ప్రజలు నమ్మి ఓటేశారన్నారు. అయితే రేవంత్ పాలన అధ్వానంగా మారిందన్నారు. రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ ప్రభుత్వానికి దీటైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నారు. అనుచరులు జగిత్యాల ప్రజల అభీష్టం మేరకు బీఆర్ఎస్ పార్టీ లో చేరబోతున్నట్టు తెలియజేశారు. కేటీఆర్ తో భేటీ అనంతరం పూర్తి వివరాలు స్పష్టం చేస్తామన్నారు.

Leave a Reply