JC Prabhakar Reddy | సుబ్బరాయ సాగర్ కి నీటిని విడుదల చేయాలి

JC Prabhakar Reddy | సుబ్బరాయ సాగర్ కి నీటిని విడుదల చేయాలి
- కలెక్టర్ ను కోరిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి
JC Prabhakar Reddy | అనంతపురం, ఆంధ్రప్రభ : పుట్లూరు మండలంలోని సుబ్బరాయ సాగర్ కి నీటిని విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ ను తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కోరారు. అనంతపురం జిల్లా పుట్లూరు మండల రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ కు జేసీ ప్రభాకర్ రెడ్డి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత రెండు నెలల కిందట సుబ్బరాయ సాగర్ లో 11.4 మీటర్ల నీరు ఉంది.. గేట్లు తెరుచుకోకపోవడం తమ దురదృష్టమన్నారు. అందువల్ల నీరు మొత్తం 29వ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి బొప్పేపల్లి చెరువుకు మళ్ళించడం జరిగిందన్నారు. అయితే, పుట్లూరు, కోమటికుంట్ల, గరుగు చింతలపల్లి చెరువులను నీటితో నింపలేక పోయారని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు ఈ గేట్లకు మరమ్మత్తులు చేయించడం జరిగిందన్నారు.
ఇప్పుడు పెనకచర్ల డ్యామ్ నుంచి సుబ్బరాయ సాగర్ కు నీటిని రిలీజ్ చేయాలని జిల్లా కలెక్టర్ ని కోరామన్నారు.. నీరు ఇవ్వకపోతే పుట్లూరు మండలంలోని రైతులు నష్టపోతారని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆనంద్ సానుకూలంగా స్పందించారు.. ఒక రైతుగా జిల్లా కలెక్టర్ ని కలిశాను.. దయచేసి దీన్ని రాజకీయం చేయొద్దండిని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.
