ఆదివాసి గిరిజనులకు కేంద్ర పథకాలు అందేలా చూడాలి

ఆదివాసి గిరిజనులకు కేంద్ర పథకాలు అందేలా చూడాలి
- జాతీయ ఎస్టి కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్
కడెం (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : ఆదివాసి గిరిజనులకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వ శాఖల అధికారులు చూడాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. గురువారం రాత్రి నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ధర్మాజీపేట్ గ్రామపంచాయతీ పరిధిలో గల కుర్రగూడెం గిరిజనుల గ్రామాన్ని ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గిరిజన గ్రామంలో గల నేలకుని ఉన్న సమస్యలను గ్రామ గిరిజనులతో ఆయన అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు గిరిజనులకు అందుతున్నాయా లేదా విషయాలపై ఆయన అరా తీశారు తమ గ్రామానికి బీటీ రోడ్డు వంతెన నిర్మాణం కోసం సహకరించాలని కుర్రగూడెం గ్రామస్తులు జాతీయ ఎస్టి కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ విన్నవించారు.
పొడు భూముల సమస్యలు సీసీ రోడ్ల నిర్మాణం అభివృద్ధి పనుల విషయంలో అలాగే ఆటవిశాఖ అధికారులతో తమకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పై సమస్యను పరిష్కరించాలని అలాగే భీమన్న గుడి సంఘం భవనము సీసీ రోడ్లు నిర్మాణం గ్రామస్తులు జాతీయ కమిషన్ సభ్యునికి కోరారు. ఈ సందర్భంగా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ గిరిజనుల సమస్యలను పరిష్కరించని ప్రభుత్వ శాఖల అధికారులపై తమకు ఫిర్యాదు చేయాలని గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి గిరిజనుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, జాతీయ నాయకులు జి శ్రీ రామ్ నాయక్, బిజెపి కడెం మండల అధ్యక్షుడు కాశవేణి శ్రీనివాస్ యాదవ్, నిర్మల్ డిఆర్ డి ఓ విజయలక్ష్మి, నిర్మల్ ఆర్డీవో రత్న కళ్యాణి, కడెం మండల డిప్యూటీ తహసిల్దార్ ఏం లచ్చిరాం , ఎంపీడీవో సునీత, ఎంపీ ఓ టి శ్రీనివాస్, ఎం ఆర్ ఐ శారద, ప్రభుత్వ శాఖల మండల స్థాయి అధికారులు ధర్మాజీపేట గ్రామ సర్పంచ్ ఒడ్నాల శిరీష సత్యం, స్థానిక పంచాయతీ కార్యదర్శి రమాదేవి, ఈజీఎస్ సిబ్బంది, బిజెపి జిల్లా నాయకులు, ఇస్లావత్ మోహన్ నాయక్, మండల నాయకులు జక్కుల సత్తన్న, కర్ణాటక భీమన్న, మంతెన అశోక్, బైరి మల్లేష్, వెంకటేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యునికి స్వాగతం పలికిన అధికారులు నాయకులు… కడెం మండలంలోని ధర్మాజీపేట జిపి పరిధిలో గల కుర్ర గూడెం గ్రామానికి తొలిసారిగా వచ్చిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ కు నిర్మల్ డి ఆర్ డి ఓ విజయలక్ష్మి, నిర్మల్ ఆర్డిఓ కళ్యాణి, కడెం మండల డిప్యూటీ తహసిల్దార్ ఏం లచ్చిరాం, ఎంపీడీవో సునీత, ఎంపీ ఓ శ్రీనివాస్, కడం ఆర్ఐ శారద, బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, కడెం మండల అధ్యక్షుడు కాశ వేణి శ్రీనివాస్ యాదవ్, పలువురు మండలంలోని బిజెపి నాయకులు, పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు.
