
Jannaram | పంచాయతీల అభివృద్ధికి పాటుపడాలి
Jannaram | పంచాయతీల అభివృద్ధికి పాటుపడాలి
- ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
Jannaram | జన్నారం, ఆంధ్రప్రభ : పంచాయతీలో కొలువుదీరిన సర్పంచులు పంచాయతీలోని ప్రతి వాడలా అభివృద్ధికి పాటుపడాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్ మేజర్ గ్రామపంచాయతి సర్పంచి జక్కు సుష్మ- భూమేష్, కలమడుగు, రేండ్లగూడ సర్పంచులు బొంతల నాగమణి-మల్లేష్, అల్లం మాధవి-రవి ప్రమాణ స్వీకరణ కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో డప్పుల చప్పుల మధ్య నృత్యాలు చేస్తూ ప్రజా ప్రతినిధులు, నేతలు విజయోత్సవ ర్యాలీ సాయంత్రం నిర్వహించారు.

ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గెలిచిన ప్రజా ప్రతినిధులు అందరూ ఐక్యంగా ఉండి పల్లెల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తే సర్పంచులను ప్రజలు తప్పకుండా గుర్తిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీనారాయణ, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఎర్ర చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ జక్కు భూమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముజఫర్, తదితరులు పాల్గొన్నారు.
