jannaram | నిరుపేదకు ఆర్థిక సహాయం

jannaram | నిరుపేదకు ఆర్థిక సహాయం
- రూ.38,500 అందజేత
jannaram | జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని రోటిగూడ గ్రామానికి చెందిన నిరుపేద నాడెం సాయవ్వకు గ్రామ గల్ఫ్ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో రూ.38,500 డబ్బులను బుధవారం సాయంత్రం అందజేశారు. గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంట చేస్తున్న సాయవ్వకు గుండెనొప్పి రావడంతో కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.
ఆ తర్వాత ఆమె గుండెకు స్టంట్ వేసి, ఈ మధ్యలోనే డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆమె ఇంటి వద్ద కోలుకుంటుంది. నిరుపేద అయిన ఆమె ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్న గ్రామ గల్ఫ్ కార్మికుల సమితి ఆధ్వర్యంలో కార్మికులు విరాళాలు సేకరించి రూ.38,500 డబ్బులను ఆర్థిక సహాయంగా అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సమితి అధ్యక్షుడు ఉప్పు తిరుపతి, నేతలు సేపూరి గోపాల్, జాలపల్లి మల్లారెడ్డి, ఒడ్డేటి రమేష్, ఉప్పు రెడ్డి, నరేష్, సతీష్, సురేష్, పులిశెట్టి భగత్, కుంట నాగేష్, గ్రామ ఉపసర్పంచి గాజుల సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.
