జన్మభూమి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ (Janmabhoomi Colony Welfare Association) ను తమ ప్రాంత ప్రజల ఐక్యత, అభివృద్ధి, భద్రత, సౌకర్యాల కోసం నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అసోసియేషన్ ని లాంఛనంగా ప్రారంభించారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం 9:00 గంటలకు జాతీయ పతాక ఆవిష్కరణ, సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural events) నిర్వహించారు.
అనంతరం కాలనీలో పచ్చదనం పెంపు కోసం మొక్కలు నాటే కార్యక్రమం (Plantation program) నిర్వహించబడింది. కాలనీ నివాసితులు, అతిథులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
నూతన కార్యవర్గం…
అధ్యక్షుడు – బాబు,
ఉపాధ్యక్షుడు – రాఘవేంద్ర రెడ్డి,
కార్యదర్శి – కిలారు రాజేశ్వర రావు,
జాయింట్ సెక్రటరీ – భరణి కుమార్,
ట్రెజరర్- నాగబాబు,
సభ్యులు – సంతోష్, జగదీశ్, శంకర్, రాజ్ కుమార్ ఉన్నారు.
ఈసందర్భంగా అధ్యక్షుడు బాబు మాట్లాడుతూ… పంచవటి కాలనీ (Panchavati Colony) కి తూర్పు దిశగా ఉన్న ప్రాంతం మొత్తం, వెస్ట్రన్ ప్లాజా (Western Plaza) వరకూ తమ జన్మభూమి కాలనీ పరిధిలోకి వస్తుందన్నారు. అలాగే తామంతా ఒకే కుటుంబంగా కలిసి మెలిసి ఉంటామన్నారు. తమ కాలనీ అభివృద్ధి (Colony development)కి తామందరం శాయాశక్తులా కృషి చేస్తామన్నారు.