జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ బదిలీ

జనగామ, ఆంధ్రప్రభ ; గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా జనగామ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న రిజ్వాన్ బాషా షేక్ జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జిహెచ్ఎంసి (GHMC) జోనల్ కమిషనర్గా ఉన్న సందీప్ కుమార్ ఝా జనగామ జిల్లా కొత్త కలెక్టర్గా నియమితులయ్యారు.
