పిఠాపురం – హిందీ భాషను వద్దని కొందరు చెప్పడం కరెక్ట్ కాదన్నారుఅధినేత పవన్ కళ్యాణ్. ఎందుకంటే అఖండ భారత దేశంలో హిందీ మాట్లాడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని.. అది అవసరం అన్నారు. మన సినిమాలను ఉత్తర ప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో విడుదల చేస్తూ అక్కడి డబ్బులు తీసుకుంటున్నప్పుడు.. హిందీ వద్దంటే కుదరదు అంటూ తేల్చి చెప్పారు. మన అభివృద్ధిలో హిందీ కూడా భాగమే అంటూ తెలిపారు.
పిఠాపురం చిత్రాడలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, భారతదేశానికి బహుభాషే మంచిది హిందీలో మాట్లాడుతూ.. హోలీ శుభాకాంక్షలు తెలిపారు. తనను ఆదరించిన తమిళనాడు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. భారతదేశానికి బహుభాషే మంచిదని పవన్ అన్నారు. తమిళనాడు సహా అన్ని రాష్ట్రాలకు ఒకే విధానం ఉండాలని ఆయన స్పష్టం చేశారు. దేశ ఐక్యత కోసం బహుభాష అవసరమన్నారు
ఇక సనాతన ధర్మం, సెక్యులరిజం గురించి కూడా మాట్లాడారు. ‘నేను ఇప్పుడేదో కొత్తగా సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నానని అనుకుంటున్నారు. కానీ నేను మొదటి నుంచి రామభక్తుడినే. గతంలో రాముడి తల నరికినప్పుడు కూడా నేను మాట్లాడాను. అమ్మవారిని అవమానించినప్పుడు కూడా బయటకు వచ్చి ప్రశ్నించాను. హిందూ దేవుళ్లను తిడుతుంటే కోపం రావొద్దంటే ఎలా. పాతబస్తీలో ఒక వ్యక్తి పోలీసులు 15 నిముషాలు టైమ్ ఇస్తే హిందువులను చంపేస్తాం అంటే కోపం రాదా’ అంటూ ప్రశ్నించారు. తిట్టినా సరే కోపం రావొద్దంటే ఎలా.. ఇదే ఇతర మతాలను తిడితే ఊరుకుంటారా అంటూ అడిగారు. సనాతన ధర్మం జోలికి రావొద్దంటూ హెచ్చరించారు
ఇల్లు దూరమైనా.. చేతిలో దీపం లేకపోయినా.. అన్ని ఒక్కడ్నే అయి ముందుకు నడిచినట్లు తెలిపారు.2014లో జనసేన పార్టీని స్థాపించామన్నారు. బావ తీవ్రత ఉన్నందుకే పోరాట యాత్ర చేశామన్నారు. ఓటమి భయం లేదు గనుకే 2019లో పోటీ చేశామన్నారు. ఓడినా అడుగు ముందుకే వేశామన్నారు. మనం నిలబడ్డాం. పార్టీని నిలబెట్టాం. నాలుగు దశాబ్దాలుగా ఉన్న టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం అని పవన్ కళ్యాణ్ అన్నారు.
2019లో మనం ఓడిపోయినప్పుడు వైసీపీ నేతలు సంబరపడి ఎన్నో అవమానాలకు గురిచేశారని పవన్ చెప్పారు.చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడిని జైల్లో పెట్టారని తెలిపారు. తనపై వైసీపీ ప్రభుత్వం చేయని కుట్రలేదని అన్నారు. మనల్ని అసెంబ్లీ గేటును కూడా తాకలేవు అని చరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టామని పవన్ వ్యాఖ్యానించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్‌తో గెలిపిచి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏపీలో నిలబెట్టామన్నారు.
.నా తెలంగాణ కోటి రతనాల వీణ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కరెంట్ షాక్ తగిలి చనిపోబోయిన తాను.. కొండగట్టు అంజన్న దీవేలతో.. తెలంగాణ ప్రజల దీవెనలతో ప్రాణాలతో బయటపడినట్లు తెలిపారు. గద్దర్ పాటను గుర్తు చేసుకున్నారు. నా అన్న గదరన్నకు వందనం అని తెలిపారు. తెలంగాణ నుంచి వచ్చిన జనసైనికులకు అభినందనలు తెలిపారు. జనసేనకు తెలంగాణ జన్మభూమి.. ఆంధ్రప్రదేశ్ కర్మభూమి అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
గద్దరన్న ఖుషీ సినిమా చూసిన తర్వాత తన అన్నయ్యను కలిసి అనంతరం తనను కలిశారని పవన్ చెప్పారు. యే మేరా జహా పాటను ప్రశంసించారన్నారు. భారతమాతను సంకెళ్లను బంధించావు కాదా నీ భావం అర్థమైందినీవు ప్రజా సేవకు వెళ్లాలని గద్దర్ చెప్పారు అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
. త్రిభాష విధానంపై చర్చ జరుగుతున్నవేళ పవన్ కళ్యాన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.ప్రసంగిస్తున్న సమయంలో ఓజీ ఓజీ అని అరుస్తున్న కార్యకర్తలను వారించారు పవన్ కళ్యాణ్.
నా మాట వినడం వల్లే 151 సీట్లున్న పార్టీ పోయిందన్నారు. ఇప్పుడు కూడా తన మాట వినండి అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఐ లవ్యూ అంటూ కార్యకర్తలనుద్దేశించి అన్నారు పవన్.పోలీసు శాఖ అంటే తనకు ఎంతో గౌరవమని పవన్ కళ్యాణ్ చెప్పారు. సభకు సహకరించిన పోలీసులకు, డీజీపీ, కాకినాడ ఎస్పీకి, అధికారులకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. తాను పోలీసు కానిస్టేబుల్ కొడుకుని ఉన్నతాధికారి కావాలనుకున్నారు కానీ.. తాను డిగ్రీ ఫెయిల్ అయ్యాయని చెప్పారు.
చంటి సినిమాలో హిరోయిన్‌లాచంటి సినిమాలో హీరోయిన్ మీనాను పెంచినట్లు తమ ఇంట్లో తనను చూసుకున్నారని పవన్ తెలిపారు. తనను బయటికి వెళ్లనిచ్చేవారు కాదన్నారు. ఒకసారి సాయంత్రం 6 గంటలకు వెళ్లాల్సిన తాను పదిన్నరకు ఇంటికి వెళ్లగా ఇంట్లోవారంతా ఎదురుచూశారన్నారు. చిరంజీవి సినిమా షూటింగ్ రద్దు చేసుకుని వచ్చారన్నారు. నాగబాబు ఇంటి బయట ఎదురుచూశారన్నారు.
తొలి ప్రేమ సినిమా సమయంలో తాను సంగీత్ థియేటర్‌లో ఓ ఇంగ్లీష్ సినిమా చూసేందుకు సెకండ్ షోకి వెళితే.. తన తండ్రి తిట్టాడని చెప్పారు. తాను హీరోను అని చెబితే ఇంకా తిట్టారన్నారు. తన తండ్రి తన అన్నయ్యను ఎక్కువ కొట్టేవారని చెప్పారు. దీంతో తాను ఏమి అనకుండా ఉండిపోయేవాడనని చెప్పారు.
అలాంటి తాను రాజకీయాల్లోకి రావడం దేవుడి రాతే అని అన్నారు. తాను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానన్నారు.2007లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు అన్ని సిద్ధాంతాల్లోని మంచిని తీసుకున్నట్లు తెలిపారు. కొందరు తన ఐడీయాలజీపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. భిన్నత్వంలో ఉన్న వారిలో ఏకత్వం చూడగలిగాను కాబట్టే పవన్ కళ్యాణ్‌గా మీ ముందున్నానని చెప్పారు.
పార్టీ పెట్టాలంటే తండ్రి ముఖ్యమంత్రి కావాలా? మావయ్య కేంద్రమంత్రిగా ఉండాలా? బాబాయిని చంపించివుండాలా? అని పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు.దశాబ్దంపాటు పార్టీని మోయాలంటే ఎన్ని అవమానాలు భరించి ఎన్ని పోగొట్టుకోవాలి. వ్యక్తిగత జీవితాన్ని కోల్పోవాలి. ఆరోగ్యం కోల్పోవాలి. మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నప్పుడు గ్రానైట్ రాళ్లను గుండెలపై పగులగొట్టిచ్చికున్నట్లు తెలిపారు. ఇప్పుడు తాను తన రెండోవ ఏడేళ్ల కొడుకును కూడా ఎత్తుకలోకేపోతున్నట్లు తెలిపారు.
మీ అండతో మళ్లీ ఆ బలాన్ని సాధిస్తున్నామన్నారు.రిజిస్టర్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పార్టీగా జనసేన మారిందని పవన్ కళ్యాణ్ అన్నారు. 100 శాతం స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించామన్నారు. గతంలో ఎంజే అక్బర్ అనే జర్నలిస్టు బీజేపీని విమర్శించారు.. ఆ తర్వాత 2014లో బీజేపీ నుంచే ఎంపీ అయ్యారు. తాను లెఫ్ట్ రైట్ మారితే తప్పా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.అల్లరి చిల్లర వాళ్లు తనకు అవసరం లేదు.. మిలిటరీలా నిలబడేవారంటేనే ఇష్టమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
ప్రధాని మోడీ బలమైన దేశం కావాలని, 5 ట్రిలియన్ ఎకనామీ కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. అందుకే దేశం కోసం నిలబడే యువత కావాలి. చంద్రబాబు వికసిత్ ఏపీ కోసం ఆలోచిస్తున్నారు. నేను భవిష్యత్ యువత కోసం ఆలోచిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ చెప్పారు.