కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే..

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే..
- అభివృద్ధి చేసే బాధ్యత నాదే.. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య …
- వార్డులను అభివృద్ధి చేస్తాం …
జనగామ, ఫిబ్రవరి 9 (ఆంధ్రప్రభ): జనగామ పట్టణం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 20, 21,22,23 వ వార్డులలో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో నిలిపిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని,ఇట్టి వార్డులు దత్తత తీసుకొని అభివృద్ధి చేసే బాధ్యత నాదేనని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వార్డు ప్రజలను కోరారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. కాంగ్రెస్ అభ్యర్థిల గెలుపుతో వార్డులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ..ఐదు వార్డుల ప్రజలు తనను ఆదరించి అభ్యర్థులను గెలిపిస్తే వార్డులలోని సమస్యలన్నీ పరిష్కరించే దిశగా ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామన్నారు. ఈనెల 11న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. డిసిసి అధ్యక్షురాలు లకావత్ ధనవంతి, నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. గత పదివేల ప్రభుత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం దోచుకున్న దాచుకున్న డబ్బుల తో గెలుస్తామని దీమాలో ఉన్నారని, అధికారంలో లేనివారు ఏమి అభివృద్ధి చేస్తారని, బీఆర్ఎస్, బిజెపి వారిని నమ్మి మోసపోవద్దు అని వెల్లడించారు. అధికార పార్టీ అండగా ఉంది రేవంత్ రెడ్డి సమక్షంలో వారి సహకారంతో జనగామ మున్సిపల్ లోని వార్డులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, ప్రజలందరికి నిరంతరం అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ విప్, ఎంపీ ల సహకారం, ప్రజల మద్దతుతో వార్డు కౌన్సిలర్లు బాల్ దే మల్లేశం , గాదరి రేణుక,మోతె రేణుక , కడకంచి బాలమణి, గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలు వార్డుల ఇంచార్జి నాయకులు, పెద్ద ఎత్తున మహిళలు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు…
