Janagama | మహాధర్నాను తరలిరండి..

Janagama | మహాధర్నాను తరలిరండి..
- ఫిబ్రవరి 23న ఢిల్లీలో నిర్వహణ
Janagama | జనగామ, ఆంధ్రప్రభ : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఫిబ్రవరి 23న ఓసీ సంఘాల మహాధర్నాను జయప్రదం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. హన్మకొండ ఓసీ జేఏసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్టంగా అమలుకు స్థితిగతులు అధ్యయనానికి జాతీయ స్థాయిలో ఓసీ కమిషన్ కొరకు ఫిబ్రవరి 23వ తేదీన ఉదయం 10.30 గం లకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహాధర్నాకు ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరింగిందని, దీనికి ఓసీలు రెడ్డి, వెలుమ, వైశ్య, బ్రాహ్మణ, కమ్మ, మార్వాడిలతో పాటు రిజర్వేషన్ పొందని వారు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుబ్బ శ్రీనివాస్, కోశాధికారి నడిపెల్లి వెంకటేశ్వర్ రావు, రాష్ట్ర నాయకులు దినుకుల రాంబాబు మాట్లాడుతూ ఓసీ ల హక్కుల కొరకు పార్లమెంట్ ఆమోదం పొందే వరకు పోరాటం కొనసాగుతుందని, ఓసీ జేఏసీలు వేలాదిగా తరలి వచ్చి మహాధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
సమావేశంలో రాధారపు సంజీవరెడ్డి, గంగిడి ప్రభాకర్ రెడ్డి, తోట సురేష్, చకిలం రాజేశ్వర్ రావు, విసం రమణ రెడ్డి, ముదికంటి వెంకట్ రెడ్డి, లూదిపెల్లి గణపతి రెడ్డి, దొడ్డ మోహన్ రావు, వెలిశెట్టి రఘు, అంచురి విజయ్, వేణుగోపాల్, గుండా ప్రభాకర్, అవినీపెల్లి రవి, వీరన్న, శ్రీనివాస్, గన్ను రామానుజం, శంశేట్టి శ్రీనివాస్, విసం సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.
