Janagama | జనగాం రైల్వే స్టేషన్ వద్ద యువకుడు హల్చల్

Janagama | జనగాం రైల్వే స్టేషన్ వద్ద యువకుడు హల్చల్
- ఆత్మహత్య బెదిరింపుతో ఉద్రిక్తత
Janagama | జనగామ, ఆంధ్రప్రభ : జనగామ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే అండర్‌పాస్ వద్ద ఓ యువకుడు రైల్వే ట్రాక్‌పై హల్చల్ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. రన్నింగ్ ట్రైన్లను అడ్డుకుని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు, రైల్వే శాఖ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని యువకుడిని శాంతింపజేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో కాసేపు రైల్వే ట్రాక్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. యువకుడు ఎందుకు ఇలా చేశాడన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
