J&K | పుల్వామాలో ఎన్ కౌంటర్ – ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, భారత సైన్యం కాశ్మీర్ లోయలో అప్రమత్తంగా ఉంది. ప్రతి కదలికను పర్యవేక్షిస్తోంది. ఇదిలా ఉండగా, జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో గురువారం ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగిందని కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.

తెల్లవారుజామున భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు… 48 గంటల్లో కేంద్రపాలిత ప్రాంతంలో ఇది రెండవ ఎన్‌కౌంటర్. జైషే మహ్మద్ కు చెందిన మరో ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో చిక్కుకున్నారని భావిస్తున్నారు, ఈ ఆపరేషన్ కొనసాగుతోంది.

పుల్వామా జిల్లాలోని త్రాల్‌లోని నాదిర్ గ్రామంలో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. అర్థరాత్రి సమయంలో జైషే మహ్మద్ కు చెందిన ఉగ్రవాదులు దాక్కుని ఉన్నట్లు భద్రతా దళాలు అనుమానించాయి. ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా దళాలపై కాల్పులకు తెగబడ్డారు దుండగులు. దీంతో ఉగ్రవాదులకు భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ మొదలైంది.భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల మరణించారు.

Leave a Reply