Jammu Kashmir | జమ్మూలో భూకంపం

Jammu Kashmir | వెబ్ డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ : జమ్మూకశ్మీర్ లో ఇవాళ‌ తెల్లవారుజామున భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 5:35 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ, జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ నివేదికల ప్రకారం రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైంది. నిద్రలో ఉన్న జనం ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Leave a Reply