శ్రీనగర్ – కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు అనుసంధానం ఇన్నాళ్లకు వాస్తవ రూపం దాల్చిందని ప్రధాని మోదీ అన్నారు. జమ్మూకాశ్మీర్‌లో నేటి పర్యటించిన ఆయన ఈ సందర్భంగా ప్రపంచంలో ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనను ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ఇన్నాళ్లకు కాశ్మీర్ ప్రజల కల నెరవేరిందని.. ఇది ఐక్యత, సంకల్పానికి చిహ్నంగా ఆయన అభివర్ణించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్టు పూర్తి కావడం పట్ల ప్రశంసలు కురిపించారు, ఇది భారతదేశ మౌలిక సదుపాయాల ప్రయాణంలో ఒక మైలురాయిగా కొనియాడారు. నేటి కార్యక్రమం భారతదేశ ఐక్యత మరియు సంకల్ప శక్తికి ఒక గొప్ప వేడుక అని మోదీ ప్రకటించారు. మాతా వైష్ణో దేవి ఆశీస్సులతో కాశ్మీర్ ఇప్పుడు భారతదేశపు విస్తారమైన రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించామని తెలిపారు.
ఇక ఇదే పర్యటనలో . శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా నుంచి శ్రీనగర్ వరకు వందే భారత్ రైలును కూడా జెండా ఊపి ప్రారంభించారు. ఈ మార్గం అందుబాటులోకి రావడంతో ప్రధానంగా పర్యాటరంగాన్ని మరింత ఆకర్షించనుందన్నారు. ఈ రైల్వే వంతెన ప్రారంభంతో పర్యాటకరంగంగా మరింత పుంజుకోనుందని పేర్కొన్నారు. శ్రీ మాతా వైష్ణో దేవి ఆలయాన్ని వందలాది మంత్రి యాత్రికులు ఇక సులభంగా దర్శించుకోవచ్చన్నారు మోదీ.