Jaipur | ఎస్టిపిపి ఎస్టి లైజన్ అధికారిగా దేవేందర్ సింగ్

Jaipur | ఎస్టిపిపి ఎస్టి లైజన్ అధికారిగా దేవేందర్ సింగ్
Jaipur | జైపూర్, ఆంధ్రప్రభ : జైపూర్ ఎస్టిపిపి ఏరియా ఎస్టి లైజన్ అధికారిగా డి. దేవేందర్ సింగ్ ఎన్నికయ్యారు. కార్పోరేట్ జిఎం(పర్సనల్)(ఐఆర్ అండ్ పిఎం)ఉత్తర్వులు జారీ చేయగా శుక్రవారం నియామక పత్రాన్ని ఎస్టిపిపి ఈడి సిహెచ్. చిరంజీవి ఈఈ దేవేందర్ సింగ్ కు (Devender Singh) అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం సెంట్రల్ ప్రెసిడెంట్ డి.పంతులా,ఎస్టి బ్రాంచ్ అధ్యక్షులు బి.తిరుమల్,ఎస్వోటు ఈడి వెంకటయ్య, బిసి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఠాకూర్ మోహన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
