Jainoor | క్రీడలు సామరస్యంగా నిర్వహించాలి….

Jainoor | క్రీడలు సామరస్యంగా నిర్వహించాలి….

Jainoor | జైనూర్, ఆంధ్రప్రభ : క్రీడలు సామరస్యంగా, స్నేహపూర్వకంగా నిర్వహించాలని జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావ్ అన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని సితగొంది గ్రామ పంచాయతీలో గల పనగడి గూడ గ్రామంలో ఈ రోజు తొడసం వారి జోరమ్మ తల్లి ఇంటి దేవత మహా పూజా ఉత్సవాల్లో చైర్మన్, నాయకులు పాల్గొని పూజలు చేశారు. ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కబడి పోటీలను పూజలు చేసి క్రీడాకారులను పరిచయం చేసుకొని చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ… క్రీడాకారులు సమయాభావం పాటించాలని కోరారు.

Jainoor

అంతే కాక విద్యార్థినీ విద్యార్థులు తప్పకుండా చదువుపై దృష్టి పెట్టాలని, క్రీడలతో పాటు చదువులో రాణించాలని అన్నారు. త్వరలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రాబోతున్నాయని, కాబట్టి మీరు అందరు కూడ పాఠశాలల‌కు, కళాశాలకు వెళ్లాల‌ని కోరారు. వారి వెంట గ్రామ పంచాయతీ సర్పంచ్ కోట్నక్ బాపూజీ, ఆదివాసీ సంస్కృతి సంప్రదాయల రాష్ట్ర కోఆర్డినేటర్ కనక సుదర్శన్, నాయకులు, సర్పంచులు మెస్రం భూపతి, మాడవి లక్ష్మణ్, సోయం ముకుంద్ జోరమ్మ తల్లీ పూజారి తొడసం ధర్మారావు, గ్రామ పెద్దలు గుణవంత రావు, గ్రామ పటేల్ దేవారి గ్రామస్తులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply