JAIL : రైల్వే దొంగలకు   ఏడాది జైలు శిక్ష

JAIL : రైల్వే దొంగలకు   ఏడాది జైలు శిక్ష

( ఆంధ్రప్రభ,  కేదారేశ్వరపేట (విజయవాడ )  :

రాజమండ్రి రైల్వే రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి వద్ద 20 రైల్వే చానెల్స్  చోరీ  కేసులో ఆరుగురు దోషులకు  విజయవాడ రైల్వే  మెజిస్ట్రేట్ ఆర్.వి.శర్మ  ఏడాది జైలు  శిక్ష విధించారు.   కర్రీ మెహర్ బాబు, కుంపాట్ల లక్ష్మణరావు, సదానల  నాగేశ్వరరావు, కంచశెట్టి మణిసాయి, చిలకలపూడి కోటేశ్వరరావు, రైల్వే ఉద్యోగి ముదావత్ చిన్న మల్లయ్య  ఈ చోరీకి పాల్పడ్డారు.  రాజమండ్రి  ఆర్డీఎఫ్ సిబ్బంది  కేసు నమోదు చేశారు .

రూ 37,500 ల  విలవ కలిగిన  ఛానల్ లను ఆర్పీఎఫ్​ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.  నేరం రుజువు కావటంతో   ఆరుగురు దోషులకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ మెజిస్ర్టేట్​  తీర్పు చెప్పారు. కోర్టు ఆదేశించే వరకు దోషులను  ప్రొబేషనరీ అధికారి పర్యవేక్షణలో ఉంచాలని ఆదేశించారు.సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి. మురళి ఈ కేసులో వాదనలు వినిపించారు.

Leave a Reply