Jai Bhim | శోక సమయంలో సంప్రదాయ సేవలు…

Jai Bhim | శోక సమయంలో సంప్రదాయ సేవలు…

  • జై భీమ్ సేవ సమితి ఆదర్శం

Jai Bhim | ఎండపల్లి, ఆంధ్రప్రభ : ఎండపల్లి మండల కేంద్రంలోని జై భీమ్ సేవ సమితి(Jai Bhim Seva Samiti) ఎస్సీ కాలనీలో ఆదర్శ సేవలు అందిస్తూ గుర్తింపు పొందుతోంది. కాలనీలో ఎవరైనా మృతి చెందిన సందర్భంలో బాధిత కుటుంబాలకు అంత్యక్రియలు, తదిన కర్మలు తదితర సంప్రదాయ కార్యక్రమాల నిర్వహణలో సమితి సభ్యులు సహకారం అందిస్తున్నారు.

దుఃఖ సమయంలో కుటుంబాలకు ధైర్యం, భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని సమితి సభ్యులు తెలిపారు. మానవత్వాన్ని చాటుతున్న ఈ సేవలు స్థానికంగా ప్రశంసలు అందుకుంటున్నాయి.

Leave a Reply