ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : అందరికీ సామాజిక న్యాయం అందించాలన్నా ఉద్దేశ్యంతో నిరంతరంగా కృషి చేసిన ఘనత డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కు దక్కుతుందని,పెద్ద ఎడ్గి సర్పంచ్ ఆస్పత్వర్ అనిల్ కుమార్,గ్రామ పెద్దలు ఆస్పత్వర్ వినోద్ అన్నారు.

బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం పెద్ద ఎడ్గి గ్రామంలో గ్రామపెద్దలు, గ్రామస్తులతో కలిసి జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఉప ప్రధానిగా,సంఘసంస్కర్తగా ఉన్నా జగ్జీవన్ రామ్ దళితులతో పాటు,పేద, బడుగు,బలహీనవర్గాల ప్రజల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని,సామాజిక న్యాయం,సమానత్వం, హక్కుల సాధన కోసం పోరాడిన యోధుడు బాబు జగ్జివన్ రామ్ అని వారన్నారు.

Leave a Reply