AP | గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌ను కలిసిన జగన్‌..

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన సతీమణి వైఎస్ భారతీతో కలిసి ఈరోజు రాజ్ భవన్ కు వెళ్లారు. ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురైన రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్‌ను మర్యాదపూర్వకంగా పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్టు తెలిసింది. గవర్నర్ ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి.

ఈ స‌మావేశంలో లిక్కర్ కేసు, ఇటీవలి ఆరెస్టులు, రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితి వంటి అంశాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో జగన్ గవర్నర్‌కు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు అందజేసిన‌ట్టు స‌మాచారం. వీటిలో లిక్కర్ కేసుకు సంబంధించి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలు, సీబీఐ/ఈడీ దాడుల నేపథ్యంలో తమ పార్టీ నేతలపై జరుగుతున్న దాడులు, అలాగే భారతీ సిమెంట్స్ సంస్థపై ఇటీవల జరిగిన సోదాలు వంటి అంశాలపై వివరణాత్మక వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply