PALACE | జగన్.. అహంకారానికి నిదర్శనం..

PALACE | జగన్.. అహంకారానికి నిదర్శనం..


రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్ మోహన్ రెడ్డి పార్టీని రద్దు చేసుకొని బెంగళూరు (Bangalore) ప్యాలెస్ కి వెళ్లి అక్కడ కర్ణాటక లో రాజకీయాలు చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు సూచించారు.

శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో (Media) మాట్లాడుతూ.. 2019 నుండి 24 వరకు అధికారంలో కొనసాగిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేశారని, వారితో పాటు వైసీపీ నాయకులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పోటీపడి ప్రజల సొమ్మును అడ్డంగా దోచుకున్నారని, ఇసుక, మద్యం, మైనింగ్, భూ దందాలు వంటి మాఫియాలు అడ్డంగా దోచుకోవడం జరిగింది. ఇది గమనించిన రాష్ట్ర ప్రజలు గత 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమికి ఎన్నడూ లేని విధంగా 164 స్థానాలలో గెలిపించుకుని అధికారాన్ని కూటమికి అప్పగించారని, 2024లో అధికారంలోకి వచ్చి 18 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పదం వైపు తీసుకు వెళుతున్నారని ముఖ్యంగా మోడీ సహకారంతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, అనునిత్యం ప్రజల కోసం కృషిచేస్తున్నారని, ఇందులో భాగంగా రాష్ట్రానికి పరిశ్రమలను తెప్పించి రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడంలో అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారన్నారు.

అదేవిధంగా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) విదేశీ పెట్టుబడులను రాబట్టడంలో తనకున్న అనుభవాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర అభ్యున్నతికై పాటుపడుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు సూపర్ సిక్స్ పథకాలను క్రమం తప్పకుండా అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందడం జరిగింది. అయితే దీనిని జీర్ణించుకోలేని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను తప్పుదారి పట్టించి మరోసారి అధికారంలోకి రావాలని తప్పుడు ఆరోపణలు చేస్తూ చాటుమాటుగా పత్రికలకు ప్రకటనలు విడుదల చేస్తున్నారు. ప్రజల ముందుకు రాకుండానే అబద్ధం ప్రచారంతో కాలం గడుపుకుంటూ అధికార పక్షం పై నిందలు వేస్తున్నారని అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో ఎంతో మంది అధికారులు వీరి ఇరువురు చెప్పినట్లుగా తల ఊపి చేసిన తప్పులకు జైలు పాలు అయ్యారు.

అయితే… జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) మరలా తానే అధికారంలోకి వస్తానని అధికారులను బ్లాక్ మెయిల్ చేసే విధంగా మాట్లాడుతుండడం వారి అహంకార ధోరణికి నిదర్శనమని అన్నారు. తాను అధికారంలో ఉండగా చేసిన అరాచకాల గురించి ప్రజలు ఇంకా మర్చిపోలేదని.. జగన్ అవినీతితో సంపాదించిన డబ్బుతో తాడేపల్లి, బెంగళూరు, హైదరాబాద్, లండన్ మొదలగుచోట్ల ప్యాలెస్లు కట్టారని ఇక రాష్ట్ర రాజకీయాలకు స్వస్తి పలికి వైసీపీ పార్టీని రద్దు చేసుకొని.. బెంగళూరులో స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవాలన్నారు. అలాగే కర్ణాటకలో రాజకీయాలు చేయాలని సూచించారు.

Leave a Reply