స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ లేటెస్ట్ అప్ కమింగ్ మూవీ ‘జాక్’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా, ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఈరోజు విడుదల కానుందని చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. అయితే, కొన్ని కారణాల వల్ల మూవీ ట్రైలర్ విడుదల రేపటికి (ఏప్రిల్ 3వ తేదీ) వాయిదా వేసినట్టు ప్రకటించారు మేకర్స్.
ఈ సినిమాలో సిద్ధు తన స్టైలిష్ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. వైష్ణవి చైతన్య ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోండగా… SVCC బ్యానర్ పై BVSN ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది.