రైతులను ముంచేసింది!
పెద్దపల్లి , ఆంధ్రప్రభ : అకాల వర్షం రైతులను నట్టేట ముంచింది. తుఫాను బీభత్సంతో చేతికి అందిన పంట నేల పాలైంది. నిన్న రాత్రి కురిసిన వర్షం తో పెద్దపల్లి జిల్లాలో వేలాది ఎకరాల పంట నీట మునిగింది. వరి, మొక్కజొన్న తో పాటు ఇతర పంటలు ఘోరంగా దెబ్బతిన్నాయి. కష్టించి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో నీటి పాలు కావడం తో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం తమకు పంట నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు. వ్యవసాయాధికారులు పంట నష్టం అంచనా వేసి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


