కొండాతో వైరమే కారణమా…
- ఈస్ట్ సమస్యలు సీఎంకు పట్టవా…
- వెస్ట్ కాన్యూస్ట్యూన్సీకే పరిమితమైన సీఎం టూర్
- తూర్పుపై సవతి తల్లి ప్రేమేనా
(ఆంధ్రప్రభ సిటీబ్యూరో, వరంగల్) : రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ఓరుగల్లు పర్యటన విజయవంతంగా ముగిసింది. కానీ చీఫ్ మినిస్టర్ టూర్ మొత్తం హన్మకొండ (వరంగల్ వెస్ట్ కాన్యూస్ట్యూన్సీ) కే పరిమితం కావడమే హాట్ టాఫిక్ గా మారింది. రాష్ట్ర మంత్రివర్గంలో సహచర మంత్రిగా కొనసాగుతున్న కొండా సురేఖ ప్రాతినిధ్యం వహించే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అడుగే మోపలేదు.
సిఎం టూర్ మొత్తం వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నియోజకవర్గంకే పరిమితం కావడంలోని అంతర్యమేమిటనే విషయమే చర్చనీయాంశంగా మారింది. వరంగల్ వెస్ట్ కాన్యూస్ట్యూన్సీకి ధీటుగా వరంగల్ ఈస్ట్ కాన్యూస్ట్యూన్సీ లో కూడా తూఫాన్ వరద ముప్పు వాటిల్లింది.
కానీ తూర్పు నియోజకవర్గంలో వరద ఉధృతితో అల్లకల్లోలంగా మారిన ఏరియాలో ఏరియల్ సర్వే కాదు…కదా… కనీసం అడుగే మోపడానికి ఇష్టపడలేదు. మంత్రి కొండా ఫ్యామిలీ కారణంగా ఏర్పడ్డ గ్యాప్ వల్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనస్సులో పెట్టుకొనే కొండా కోటలో అడుగు పెట్టలేదా అనే సంశయాలు కలుగుతున్నాయి.
హన్మకొండ కలెక్టరేట్లో చీఫ్ మినిస్టర్ రేవంత్ నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో మంత్రి కొండా సురేఖను పక్కనే కూర్చో పెట్టు కొన్నప్పటికి ఈస్ట్ కాన్యూస్ట్యూన్సీలో పర్యటించక పోవడంలోని పరమార్థమేమిటనే విషయమే ఆసక్తికరంగా మారింది. రెయిన్ ఎఫెక్ట్ ఒక్క పశ్చిమ నియోజకవర్గంకే పరిమితం కాలేదు,పక్కనే అనుకోని ఉన్న తూర్పు నియోజకవర్గంలో కాలు మోపక పోవడంలోని మతలేబీమెటనే విషయం బోధపడటం లేదు.
పోతననగర్ కే టూర్ పరిమితం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ములుగు క్రాస్ రోడ్డు దాటి రంగం పేట, పోతన నగర్లల్లోనే పర్యటించి తిరిగి హన్మకొండ కలెక్టరేట్ కు బయలుదేరి వెళ్ళారు. రంగం పేట, పోతన నగర్ ప్రాంతాలు సైతం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోకే వస్తాయి. అత్యంత ఎఫెక్ట్ ఏరియాగా చెప్పుకొనే ఎన్టీఆర్ నగర్ లో కూడా పర్యటించలేదు.
వరంగల్ లో వర్ష తీవ్రత ప్రారంభం కాగానే ఎన్టీఆర్ నగర్ పై పడుతుంది.అటువంటి లోతట్టు ప్రాంతాన్ని సైతం సీఎం పర్యటించక పోవడంను బట్టే ముఖ్యమంత్రి పశ్చిమ నియోజకవర్గానికే పరిమితమైన్నట్టుగానే చెప్పకనే తెల్సి పోతోంది.
కొండా పై అలక వీడలేదా
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కొనసాగుతూ సీఎం పై కొండా దంపతుల కూతురు సుస్మిత పటేల్ చేసిన తీవ్ర ఆరోపణలతో నొచ్చుకొన్న విషయం తెలిసిందే. కొండా కపుల్స్ డాటర్ చేసిన కామెంట్స్ వ్యవహారంను దీపావళి పర్వదినం రోజున సీఎం ఇంటికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లతో వెళ్ళి సయోధ్య కుదుర్చుకున్నారు. అయినప్పటికీ సీ ఎం రేవంత్ రెడ్డి అదే విషయాన్ని మనస్సులో పెట్టుకొనే మంత్రి కొండా కోటలో అడుగు పెట్టలేదా అనే సంశయాలు వ్యక్తమవు తున్నాయి.
సీఎం తో ఏర్పడ్డ విబేధాలు సమసిపోయాయనే చాటి చెప్పుకొనేందుకైనా నియోజకవర్గంలో సీఎం టూర్ కొనసాగే విధంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ కొండా కపుల్స్ సీఎం ను ఈస్ట్ పర్యటనకు ఆహ్వానించారా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు. సీఎం రేవంత్ రెడ్డి టూర్ వరంగల్ పశ్చిమకే పరిమితం కావడంపై రాష్ట్ర మంత్రి కొండా సురేఖనే వివరణ ఇస్తే తప్పా… ఊహాగానాలకు తెర పడే అవకాశం ఉంది.

