నిండా ముంచిన ముంథా
అచ్చంపేట, ఆంధ్రప్రభ : పొరుగు రాష్ట్రంలోని ఏర్పడిన ముంథా తుఫాన్(Muntha typhoon)తో నాగర్ కర్నూల్ జిల్లాలోని అన్నదాతలను నిండా ముంచేసింది. ముంథా ప్రభావంతో సోమవారం రాత్రి నుంచి నిన్న రాత్రి వరకూ కురిసిన ఏకధాటి వర్షాలు రైతులకు కోలుకులేని దెబ్బతీసింది. రైతన్నలు ఆరుగాలం రేయింబవళ్లు చెమటోడ్చి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయానికి నాశనమైపోయింది. వరి, మొక్కజొన్న, పత్తి పంటలు వరద ఉధృతిలో కొట్టుకుపోగా గ్రామాల్లో మట్టి మిద్దెలు సైతం నేలమట్టమయ్యాయి.
పొంగి పొర్లిన వాగులతో రహదారులు మూసివేయబడి గ్రామాల నుండి గ్రామాలతోపాటు రాష్ట్ర రాజధాని(state capital)కి రాకపోకలు ఆగిపోయాయి. అదృష్టవశాత్తు ఎక్కడా ప్రాణ నష్టం జరుగలేదు. నియోజకవర్గం(Constituency)లోని చాలా గ్రామాలు నీట మునిగిపోయాయి. ఏజెన్సీ ప్రాంతంలోని మార్లపాడు గ్రామంలో ఏ ఒక్క ఇల్లు కూడా మిగులకుండా గ్రామం మొత్తం పూర్తిగా జలదిగ్భందంలో చిక్కుకుపో్యింది. గ్రామస్థులు పూర్తిగా నిరాశ్రయులై కట్టుబట్టలతో మిగిలారు.

ఎమ్మేల్యే వంశీకృష్ణ ట్రాక్టర్‌పై మార్లపాడు తాండాకు చేరుకొని ప్రభుత్వం నుండి పూర్తి స్థాయిలో సహకారామందిస్తామని హామీ ఇచ్చి వారిని ఓదార్చి సీబీఎం ట్రస్ట్ చైర్ పర్సన్ డాక్టర్ అనురాధ(Dr Anuradha Dr.) సహకారంతో తడిచి ముద్దైన వారికి రగ్గులు ఇప్పించారు. విద్యుత్తు స్థంబాలు నేలకొరగడంతో చాలా గ్రామాలలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడగా కొన్ని గ్రామాలు అంధకారంలో మగ్గిపోయారు. రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ, విద్యుత్తు, పంచాయతీ రాజ్, ఇరిగేషన్ శాఖ(Irrigation Department) అధికారులు సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమించి పరిస్థితులను అదుపులోకి తీసుకువస్తున్నారు.


అచ్చంపేట నియోజకవర్గంలోని మండలాలల్లో మట్టి మిద్దెలు కూలిపోయాయి. గ్రామాలలో దాదాపు 40 నుండి 50 ట్రాన్స్ఫార్మర్లు మునిగిపోయినట్లు ఏడీఈ ఆంజనేయులు తెలిపారు. ఇంకా నష్టాలు అంచనా వేస్తున్నారు. దాదాపు రెండు వేల ఎకరాలలో చేతికొచ్చిన వరి, మొక్కజొన్న, పత్తి పంటలు వరదలో కొట్టుకోపోయి రైతన్నలకు(farmers) అపార నష్టాన్ని మిగిల్చింది.
ఉమామహేశ్వర క్షేత్రంలో కొండచరియలు విరిగి పడుతుండడంతో ఆలయాన్ని మూసి వేసినట్లు, ఉమామహేశ్వరంలో దాదాపు 40 లక్షలకు పైగా నష్టం చేకూరినట్లు ఆలయ ఛైర్మన్ బీరం మాధవ రెడ్డి, ఈఓ శ్రీనివాసరావులు తెలిపారు. హైదరాబాద్`శ్రీశైలం జాతీయ రహదారిపై వున్న బ్రిడ్జి కోతకు గురై సగానికి పైగా వంతెన నేలమట్టమై రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడడంతో జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్(District SP Vaibhav Gaikwad Raghunath), అచ్చంపేట డీఎస్పీ పల్లె శ్రీనివాసులు అక్కడే వుండి ప్రత్యమ్నాయా మార్గాలలో ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.


రహదారులు కోతకు గువరద ముంపుకు గురైన ప్రాంతాలను ఎమ్మేల్యే వంశీకృష్ణ సందర్శించి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుండి సహాయం అందేలా కృషి చేస్తానని హామి ఇచ్చారు. ఆ మేరకు పూర్తి నివేదికను యుద్ద ప్రాతిపాదికగా ప్రభుత్వానికి అందించాలని అధికారులను ఆదేశించారు.




