ఆలయాలపై దోపిడీని అరికట్టాలి

ఆలయాలపై దోపిడీని అరికట్టాలి

కోటగుళ్లలో పురాతన దేవాలయాలపై అక్రమాలపై ఆందోళన
ఆలయం కు ఎండోమెంట్ నూతన కమిటీని ఏర్పాటు చేయాలి
అభివృద్ధికి ఎమ్మెల్యే జోక్యం అవసరం
స్థానిక ప్రజలు , భక్తుల డిమాండ్

గణపురం, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రమైన కోటగుళ్ల దేవాయంలో ప్రస్తుతం ఎలాంటి కమిటీ లేకుండా ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోకి వెళ్లి వ్యాపార కేంద్రంగా మారిందనే ఆరోపణలు సర్వత్ర వినిపిస్తున్నాయి. ఆలయాల్లో ప్రైవేట్ వ్యక్తుల ఆగడాలు ఎక్కువ అయ్యాయని, ఆలయాల్లో ప్రైవేట్ కట్టాలని, ఎండోమెంట్ అధికారులు , ప్రభుత్వం తక్షశిల చెప్పటానికి స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఘటన గ్రామ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

స్థానిక ప్రజలు మాట్లాడుతూ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు. గురువారం కోటగుళ్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రామస్థులు మాట్లాడుతూ గతంలో గణపురం కోటగుళ్ళు, గణపసముద్రం చెరువు కట్ట, ఇంటర్నల్ రోడ్లు, రామాలయం అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని స్ధానిక ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఆ హామీలలో భాగంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయని చెప్పారు.

అయితే దేవాలయాలపై ప్రయివేటు వ్యక్తుల అక్రమ సంపాదన, అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయనీ గ్రామస్థుల నుండి ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా శివకళ్యాణం ఘనంగా నిర్వహించాలని, ఆ గౌరవం ఎమ్మెల్యేకి దక్కేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. అదేవిధంగా ప్రైవేట్ వ్యక్తులు చందాల వసులు చేసి లక్షల రూపాయలు వసులచేసుకోసుకున్నారని,గత కమిటీ పోచమ్మ దేవాలయం పట్ల నిర్లక్ష్యం చూపారన్నారు. అదేవిధంగా అధికారులు ఇతర దేవాలయాలపై దృష్టి సారించడం పట్ల కూడా ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

కోటగుళ్లు, రామాలయం, రెడ్డి గుడి, పోచమ్మ, ఎల్లమ్మ దేవాలయాలన్నింటిపైనా సమానంగా శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ప్రాంత అభివృద్ధిలో ముందుండే నాయకుడిగా గుర్తింపు పొందిన ఎమ్మెల్యే ఈ సమస్యలను పరిష్కరించి దేవాలయాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు. ఈ విలేకరుల సమావేశంలో సుమారు 200 మంది గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply