IRAN | హర్మూజ్‌ను తెరిచేదే లేదు…

IRAN | హర్మూజ్‌ను తెరిచేదే లేదు…

IRAN | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : త‌మ‌ విద్యుత్‌ కేంద్రాలపై దాడులు చేస్తే హర్మూజ్‌ను తెరిచేదే లేదని ఇరాన్ తెలిపింది. విద్యుత్‌ కేంద్రాలపై దాడులు చేస్తామన్న ట్రంప్‌ హెచ్చరికలను ఇరాన్‌ ఖండించింది. త‌మ విద్యుత్‌ కేంద్రాలపై దాడులు చేస్తే.. హర్మూజ్‌ను తెరిచేదే లేదని తెలిపింది. పవర్‌ ప్లాంట్‌లే లక్ష్యంగా చేసుకుంటే.. హర్మూజ్‌ను పూర్తిగా మూసివేస్తాని, ఆ విద్యుత్‌ కేంద్రాలు పునర్నిర్మించేవరకు హర్మూజ్‌ను తెరిచేదే లేదని ఇరాన్ తెలిపింది.

ఇజ్రాయెల్‌ విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామ‌ని, ఇజ్రాయెల్‌ ఇంధన మౌలిక సదుపాయాలు లక్ష్యంగా చేసుకుంటాం ఇరాన్ పేర్కొంది. ఇజ్రాయెల్‌ సమాచార, ప్రసార సాంకేతికతలను లక్ష్యంగా చేసుకుంటామ‌ని, పశ్చిమాసియాలోని అమెరికా భాగస్వామ్య కంపెనీలు కూడా పూర్తిగా నాశనం చేస్తాయ‌ని, చమురు కేంద్రాలను చట్టబద్ధ లక్ష్యాలుగా పరిగణించి కోలుకోలేకుండా దెబ్బతీస్తాయ‌ని, చమురు ధర పెరిగిపోయి చాలా కాలం ఆ ప్రభావం కొనసాగుతుందని ఇరాన్ తెలిపింది.

Leave a Reply