IPS REMAND : అయ్యో పీఎస్ లూ.. Andhra Prabha Detail Report

IPS REMAND : అయ్యో పీఎస్ లూ.. Andhra Prabha Detail Report
IPS సునీల్ నాయక్ రిమాండ్
రఘురామ బర్త్‌డేనే బ్లాక్‌డే?
రాజద్రోహం కేసు నుంచి
కస్టోడియల్ టార్చర్ వరకు
సుప్రీంకోర్టు ఆగ్రహం..
ఆర్టికల్ 21 ఉల్లంఘన?
ఆర్మీ ఆసుపత్రి నివేదితొ కీలక మలుపు
హత్యాయత్నం కేసులో ..
బీహారీ ఐపీఎస్ సునీల్ నాయక్ అరెస్ట్
రిమాండ్ రిపోర్టులో సంచలన అంశాలు
వాట్ నెక్ట్స్? మరిన్ని అరెస్టులా?
పోలీసు వర్గాల్లో అలజడి
సునీల్ కుమార్ మెడకు ఉచ్చు?
( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి)
ఆ నాటి రాచరికం కావొచ్చు.. నేటి రాజకీయం కావొచ్చు. గుడాచారి వ్యవస్థ ఎప్పడూ రాజద్రోహుల వేటలోనే .. అహర్నిశం ..అహోరాత్రులు శ్రమిస్తుంది. సింహాసనం పై..కూర్చోని తమ పీఠం చేజారే స్థితిపై భయంతో కంగారు పడే పాలకులకు ఈ నిఘా నిచారులే నమ్మిన బంటులు. ప్రభుత్వం.. పాలకులు మారితే.. తొలి దోషులూ ఈ గుఢాచారులే. అధికార పక్షానికి ఊడిగం చేసే పనిలో.. శత్రువులను పెంచుకుంటే.. ఏమి జరుగుతుందో.. ఏపీ ఐపీఎస్ లు.. అమ్మో పీఎస్ అవతారంఎత్తక తప్పలేదు.

ప్రజాప్రతినిధి పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణం రాజు అక్రమ అరెస్టు .. కస్టోడియల్ టార్చర్ కేసులో.. ముగ్గురు ఐపీఎస్ లు.. ఓ డాక్టరమ్మ అడ్డంగా బుక్కయ్యారు. ఎన్ కౌంటర్ స్పెషలిస్టు మెడల్స్ .. నేరగాళ్ల గుండె సింహస్వప్నాలుగా బిరుదులు సాధించిన ఈ నాలుగో సింహౄలు.. ఇఅధికార పార్టీ తొత్తులుగా తప్పుడు నిర్ణయాలతో కోర్టు బోనులో నిలబడుతున్నారు. తాజాగా బీహారీ కేడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఇక మరో ముగ్గురు ఐపీఎస్ అధికారులు, గుంటూరు జీజీహెచ్ వైద్యాధికారి కూడా త్వరలోనే రిమాండు ఖైదీ హోదాలో జైలుకు వెళ్లటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రజల కప్పంతో చదువుకఉని.. ప్రజల కోసం, ప్రజల అధికారిగా .ప్రజాసవ చేయాల్సిన ఆఫీసర్లు.. ఉద్యోగ విరమణ స్థితలో.. పాలకులకు బానిసలైతే.. .. జనం సహించగలరా? కనీసం అయ్యో పాపం అనగలరా? ఆఫీసర్లను, పోలీసులను కళ్లు తెరవాలని నిరూపించే ఈ కథనం తెలుసుకుందాం.
IPS REMAND : ఆరోజు రఘురామ బర్త్ డే..

ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో అప్పటి ఎంపీ రఘురామ రాజుపై రాజద్రోహం (Sedition – IPC Section 124A) కేసు నమోదు చేశారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టేలా ప్రసంగించారని సెక్షన్ 153A, 505 కింద కూడా కేసులు పెట్టారు.. 2021 మే 14న .హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని రఘురామ కృష్ణం రాజు ఇంటిలో సాయంత్రం సుమారు 4:30 – 5:00 గంటల మధ్య ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ రోజు ఆయన పుట్టినరోజు కావడం గమనార్హం.

ఆయనను మే 14 సాయంత్రం అరెస్ట్ చేసి గుంటూరు తరలించారు. మే 15, 16 తేదీల్లో సీఐడీ కస్టడీలో విచారించారు. సుమారు 3 నుండి 4 రోజుల పాటు ఆయన పోలీసుల అదుపులో ఉన్నారు. మే 17న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆయనను సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించారు.విచారణ సమయంలో తనను కుర్చీకి కట్టేసి, అరికాళ్లపై కర్రలతో బాదారని, బూట్లతో తొక్కారని రఘురామ స్వయంగా కోర్టులో ఫిర్యాదు చేశారు. ఆర్మీ ఆసుపత్రి నివేదికలో ఆయన కాలి వేలు ఎముక విరిగినట్లు (Toe Fracture) తేలడంతో చిత్రహింసలు జరిగినట్లు బలమైన సాక్ష్యం లభించింది. అంతే కాదు తనను కొడుతున్న దృశ్యాలను సీఐడీ అధికారులు వీడియో కాల్ ద్వారా అప్పటి ప్రభుత్వ పెద్దలకు (ముఖ్యమంత్రి కార్యాలయం లేదా ఉన్నతాధికారులకు) ప్రత్యక్షంగా చూపించారని రఘురామ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ అంశంపైనే ప్రస్తుతం పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం సునీల్ నాయక్ ఈ వీడియో కాల్ , చిత్రహింసల సమయంలో అక్కడే ఉన్నారా లేదా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
IPS REMAND : హక్కుల ఉల్లంఘన:
రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసిన విధానం, ఆయనకు గాయాలను చూసిన సుప్రీంకోర్టు, “ఒక ఎంపీకి ఇలాంటి పరిస్థితి ఎదురైతే, సామాన్యుడి పరిస్థితి ఏమిటి?” అని ప్రశ్నించింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (జీవించే హక్కు) కు విరుద్ధమని కోర్టు పేర్కొంది.
IPS REMAND : ఆర్మీ ఆసుపత్రి నివేదిక
గుంటూరు ఆసుపత్రి నివేదికను పక్కనపెట్టి, సుప్రీంకోర్టు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి నివేదికను ప్రామాణికంగా తీసుకుంది. ఆ నివేదికలో గాయాలు ఉన్నట్లు తేలడంతో, అప్పటి ప్రభుత్వ యంత్రాంగంపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రాజద్రోహం (Sedition) సెక్షన్‌పై అభ్యంతరం: కేవలం ప్రభుత్వ విమర్శలు చేసినంత మాత్రాన సెక్షన్ 124A వంటి కఠినమైన రాజద్రోహం కేసులు ఎలా పెడతారని కోర్టు అప్పట్లో ప్రభుత్వాన్ని నిలదీసింది. ప్రభుత్వం విమర్శలను సహించలేకపోతోందా? అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రభుత్వ అధికారుల ఒత్తిడికి తలొగ్గి తప్పుడు వైద్య నివేదికలు ఇచ్చిన వైద్యుల తీరును కూడా కోర్టు తప్పుబట్టింది. ప్రొఫెషనల్ ఎథిక్స్ ఎక్కడ ఉన్నాయా? అని ప్రశ్నించింది. ఇప్పుడు అదే వైద్యులు పోలీసు విచారణను ఎదుర్కొంటున్నారు.
IPS REMAND : పట్టించిన నివేదికే

సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి (Army Hospital) సమర్పించిన వైద్య నివేదిక ఈ కేసులో అత్యంత కీలకమైన మలుపు తిప్పింది. ఆర్మీ ఆసుపత్రి వైద్య నివేదిక ప్రకారం , రఘురామకృష్ణరాజు కుడి కాలి రెండో వేలు ఎముక విరిగినట్లు (Fracture of the second toe) ఎక్స్‌రేలో స్పష్టంగా తేలింది. ఇది మామూలు గాయం కాదని, బూట్లతో బలంగా తొక్కడం వల్ల లేదా కర్రలతో కొట్టడం వల్ల జరిగిందని వైద్యులు నిర్ధారించారు.. తీవ్ర వాపులు, రక్తపు గడ్డలు (Edema & Ecchymosis): ఆయన రెండు అరికాళ్లపై నీలి రంగులో రక్తపు గడ్డలు కట్టినట్లు (Ecchymosis) తీవ్రమైన వాపులు ఉన్నట్లు గుర్తించారు. విచారణ సమయంలో ఆయన కనీసం నిలబడలేక, నడవలేక ఇబ్బంది పడుతున్నారని, ఇది కస్టోడియల్ టార్చర్ వల్ల జరిగిన శారీరక హింసకు నిదర్శనమని ఆర్మీ వైద్యులు పేర్కొన్నారు. ఆయనకు అంతకుముందే బైపాస్ సర్జరీ జరిగిన నేపథ్యంలో, కస్టడీలో
జరిగిన హింస వల్ల ఆయన ఆరోగ్యం మరింత క్షీణించే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది.
IPS REMAND : హత్యాయత్నం కేసు

ఆర్మీ నివేదికలో గాయాల తీవ్రతను చూసిన తర్వాతే, పోలీసులు ఐపీఎస్ అధికారులపై హత్యాయత్నం కేసును నమోదు చేయగలిగారు. గుంటూరు జీజీహెచ్ (GGH) వైద్యులు ఇచ్చిన నివేదిక అబద్ధమని తేలడంతో, ఇప్పుడు డాక్టర్ ప్రభావతి పై క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి ఇది ఆధారమైంది. ఈ నివేదిక ఆధారంగానే సుప్రీంకోర్టు అప్పట్లో తక్షణమే బెయిల్ మంజూరు చేసింది దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించింది
IPS REMAND : కోర్టుకు సునీల్ నాయక్
బీహారీ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు పాట్నాలోఅదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను ట్రాన్సిట్ వారెంట్‌పై ఆంధ్రప్రదేశ్‌కు తరలించారు. 2021లో వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎంపీ రఘురామ కృష్ణంరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో సీఐడీ డీఐజీ (CID DIG) సునీల్ నాయక్, రఘురామను కస్టడీలో థర్డ్ డిగ్రీ తో వేధించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా విచారణకు హాజరుకావాలని గతంలో పోలీసులు పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ, సునీల్ నాయక్ స్పందించకపోవడంతో పోలీసులు ఈ అరెస్ట్ చర్య చేపట్టారు.
ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు మరికొంతమంది సీనియర్ పోలీసు అధికారుల పేర్లు కూడా నిందితుల జాబితాలో ఉన్నాయి.
పి.వి. సునీల్ కుమార్ (ADGP): అప్పటి ఏపీ సీఐడీ చీఫ్. ఈయనపై ప్రధాన కుట్రదారుగా ఆరోపణలు ఉన్నాయి. పి. సీతారామాంజనేయులు (IPS): అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్. సునీల్ నాయక్ (IPS): అప్పటి సీఐడీ డీఐజీ (ప్రస్తుతం అరెస్ట్ అయ్యారు). డాక్టర్ ప్రభావతి: గుంటూరు GGH మాజీ సూపరింటెండెంట్ (తప్పుడు వైద్య నివేదికలు ఇచ్చినందుకు).అప్పటి ముఖ్యమంత్రి (ఏ1 నిందితుడిగా ఫిర్యాదులో పేర్కొన్నారు).ఈ కేసును మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేశారు. సెక్షన్ 307: హత్యాయత్నం (తీవ్రంగా కొట్టినందుకు). సెక్షన్ 120B: నేరపూరిత కుట్ర. సెక్షన్ 330, 348: నేరాన్ని ఒప్పుకోవాలని బలవంతం చేస్తూ శారీరక హింసకు గురిచేయడం., సెక్షన్ 166, 167: ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి చట్టాన్ని ఉల్లంఘించడం . తప్పుడు పత్రాలు సృష్టించడం. సెక్షన్ 193: కోర్టుకు తప్పుడు సాక్ష్యాధారాలు/నివేదికలు సమర్పించడం. అనే అంశాలపై కేసు నమోదు చేశారు.
IPS REMAND : రిమాండ్ రిపోర్టు
గుంటూరు కోర్టులో పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఈ క్రింది కీలక అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం:. రఘురామకృష్ణరాజును కేవలం విచారించడమే కాకుండా, శారీరకంగా దెబ్బ తీయాలనే ముందస్తు ప్రణాళికతోనే సునీల్ నాయక్ ఇతర అధికారులు వ్యవహరించారని పేర్కొన్నారు. చిత్రహింసలు పెడుతున్న సమయంలో సునీల్ నాయక్ తన ఫోన్ ద్వారా అప్పటి ప్రభుత్వ పెద్దలకు వీడియో కాల్ చేసినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయని పోలీసులు రిపోర్టులో వివరించారు. విచారణ గదిలోని సీసీటీవీ ఫుటేజీని కావాలనే డిలీట్ చేశారని, ఇందులో సునీల్ నాయక్ పాత్ర ఉందని పోలీసులు ఆరోపిస్తున్నారు. రఘురామకు గాయాలు లేవని తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చేలా జీజీహెచ్ వైద్యులను ఈయనే బెదిరించారని రిపోర్టులో పేర్కొన్నారు.
IPS REMAND : వాట్ నెక్ట్స్..
సునీల్ నాయక్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పి.వి. సునీల్ కుమార్ (A1): ఈయన అరెస్ట్ కోసం పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన సస్పెన్షన్ పొడిగిం ముందస్తు బెయిల్ నిరాకరణ ఈ సూచనలే ఇస్తున్నాయి. డాక్టర్ ప్రభావతి (జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్): తప్పుడు మెడికల్ రిపోర్టులు ఇచ్చినందుకు ఈమెను ఏ క్షణమైనా అదుపులోకి తీసుకోవచ్చు.అప్పటి ప్రభుత్వంలోని కీలక నేతలు: అధికారులకు ఆదేశాలు ఇచ్చిన రాజకీయ నాయకుల పాత్రపై కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం సునీల్ నాయక్‌ను పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ మంగళగిరి పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. కస్టడీలో మరిన్ని డిజిటల్ సాక్ష్యాలు (ఫోన్ డేటా, మెసేజ్‌లు) బయటకు వచ్చే అవకాశం ఉంది.
IPS REMAND : పోలీసుల గుండెల్లో అలజడి

ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అరెస్ట్ తర్వాత, ఈ కేసులో తదుపరి అరెస్టులు ఎవరివి ఉండవచ్చు అనే అంశంపై పోలీసు వర్గాల్లో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం పి.వి. సునీల్ కుమార్ (రిటైర్డ్ ఐపీఎస్): అప్పటి సీఐడీ చీఫ్ అయిన ఈయనపై ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లు కోర్టులో వీగిపోతే, పోలీసులు ఆయనను అరెస్ట్ చేసే అవకాశం మెండుగా ఉంది. సునీల్ కుమార్ ఇప్పటికే పోలీసు విచారణకు హాజరయ్యారు. పి. సీతారామాంజనేయులు (IPS): మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అయిన ఈయన పేరు కూడా ఎఫ్ఐఆర్లో ఉంది. కుట్రలో ఈయన ప్రమేయంపై ఆధారాలు సేకరించినట్లు సమాచారం.

జీజీహెచ్ వైద్యురాలు (డాక్టర్ ప్రభావతి బృందం): తప్పుడు మెడికల్ రిపోర్టులు ఇచ్చి, గాయాలను దాచిపెట్టినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న వైద్యులను కూడా పోలీసులు అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే వారిని మంగళగిరి పోలీసులు పలుమార్లు ప్రశ్నించారు. కింద స్థాయి అధికారులు: రఘురామను కొట్టిన సమయంలో అక్కడ ఉన్న ఇతర పోలీసు సిబ్బందిని (సీఐలు, ఎస్సైలు) కూడా గుర్తించి చర్యలు తీసుకునే దిశగా దర్యాప్తు సాగుతోంది.
IPS REMAND : సునీల్ కుమార్ మెడకు ..:

విచారణలో సునీల్ నాయక్ ఇచ్చే వాంగ్మూలం (Statement) ఈ కేసులో చాలా కీలకం కానుంది. ఆయన ఎవరి ఆదేశాల మేరకు పనిచేశారో వెల్లడిస్తే, అప్పటి ప్రభుత్వ పెద్దలపై కూడా పోలీసులు చర్యలు వేగవంతం చేసే అవకాశం ఉంది. సిఐడి మాజీ చీఫ్ పి.వి. సునీల్ కుమార్ పాత్రపై పోలీసులు సేకరించిన కీలక ఆధారాలు ఆరోపణల వివరాలు ఇక్కడ ఉన్నాయి. రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసిన సమయంలో సునీల్ కుమార్ సిఐడి అదనపు డీజీగా ఉన్నారు. ఆయన నేరుగా విచారణను పర్యవేక్షించారని, సెల్‌ఫోన్ సిగ్నల్స్ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆయన ఆ సమయంలో సీఐడీ కార్యాలయంలోనే ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అరెస్ట్‌కు ముందే పక్కా స్కెచ్ వేసి, ఎక్కడ విచారించాలి, ఎలా ఒత్తిడి తీసుకురావాలి అనే అంశాలపై ఆయన ఆదేశాలు ఇచ్చారని సాక్ష్యాలు సేకరించినట్లు తెలుస్తోంది. గుంటూరు జీజీహెచ్ (GGH) వైద్యులకు ఆదేశాలు ఇచ్చి, రఘురామకు గాయాలు లేవని నివేదిక ఇచ్చేలా ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలపై పోలీసులు ఫోన్ కాల్ డేటా (CDR) ను సేకరించారు. విచారణలో పాల్గొన్న కొందరు కింది స్థాయి సిబ్బంది పోలీసులు, సునీల్ కుమార్ ఆదేశాల మేరకే తాము వ్యవహరించామని పోలీసుల దర్యాప్తులో వెల్లడించినట్లు సమాచారం.రఘురామను హింసించిన సమయంలో ఉపయోగించిన పరికరాలు లేదా ఆ గదిలో ఉన్న పరిస్థితులకు సంబంధించి ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. సునీల్ కుమార్ ఇప్పటికే పలుమార్లు పోలీసు విచారణకు హాజరయ్యారు, కానీ ఆయన తనపై ఉన్న ఆరోపణలను తోసిపుచ్చారు. ఇదంతా రాజకీయ కక్షసాధింపు అని ఆయన వాదిస్తున్నారు.
ALSO READ : 3 Lady Dons : వీళ్లే మాఫియా మా రాణులు Andhra Prabha Crime Story
