ఇప్పగూడెం చరిత్ర పాట ఆవిష్కరణ

స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్పూర్ మండలం ఇప్పగూడెం గ్రామ చరిత్రపై కవి, గాయ కుడు పల్లె నరేందర్ గౌడ్ రూపొందించిన ఇప్పగూడెం చరిత్ర (పార్ట్–1) పాటను గురువారం ఆవిష్కరించారు. గ్రామంలోని కాటమయ్య గుడి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ డైరెక్టర్ చట్ల యాకయ్య గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ చిన్న వయసులోనే గ్రామ చరిత్రను ఎంతో అద్భుతం గా పాట రూపంలో ఆవిష్కరించిన పల్లె నరేందర్ గౌడ్‌ను అభినందించారు.
భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని చారిత్రాత్మక గీతాలను రచించి గ్రామానికి మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం నరేందర్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మందపురం రాణి అనిల్ గౌడ్, మాజీ సర్పంచ్ కత్తుల కట్ట య్య, ఎస్సై పల్లె పవన్ గౌడ్, గట్ల కొండల్ రెడ్డి, మల్లా రెడ్డి, కుర్ర ఉప్ప లయ్య, చట్ల యాకయ్య, పల్లె లక్ష్మీనారాయణ, చట్ల రాజు, ఎల్ల గౌడ్, శివాజీ, రాజ్ కుమార్, రజినీకాంత్, మధు, దామెర వేణు తదితర గ్రామస్థులు పాల్గొన్నారు.
