విశాఖపట్నం, ఆంధ్రప్రభ బ్యూరో: విశాఖ పోతినమల్లయ్యపాలెంలో ఉన్న ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేధికగా నేడు (సోమవారం) రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్-లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. ఢిల్లీ జట్టుకు విశాఖ రెండో హోమ్ గ్రౌండ్‌గా ఉంది. ఇక్కడ క్యాపిటల్స్ రెండు మ్యాచ్‌లు ఆడనుంది. అయితే తొలి మ్యాచ్‌లో లక్నోతో ఢిల్లీ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ కోసం సర్వం సిద్దం చేశారు. ఈ మేరకు నిర్వాహకులు స్టేడియంను సర్వంగా, సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సీజన్‌లో రెండు జట్లకు ఇదే తొలి మ్యాచ్ కావడంతో ఉత్సాహంగా బరిలోకి దిగేందుకు క్రీడాకారులు సిద్ధమయ్యారు. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభంకానుంది.
ప్రత్యేక ఆకర్షణగా రిషబ్ పంత్, అక్షర్ పటేల్
నేడు జగనున్న ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జైయింట్స్ జట్టు-కు సారధ్యం వహి స్తున్న రిషబ్ పంత్, ఢిల్లీ క్యాపిటిల్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న అక్షర్ పటేల్ క్రీడా భిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఢిల్లీ క్యాపిటిల్స్ జట్టులో అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్, కుల్దిdప్ యాదవ్, మిచెల్ స్టార్స్, ఫాఫ్ డుప్లెసిస్, టిస్టన్ స్టబ్స్, నటరాజన్ వంటి స్టార్ ఆటగాళ్లతో ఈ జట్టు చాలా పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు లక్నో జెయింట్స్‌లో కెప్టెన్ రిషబ్ పంత్‌తో పాటు మిచెల్ మార్ష్, డేవిడ్ మిల్లర్, నికోలస్ పూరన్, రవి బిష్ణోయ్, అబ్దుల్ సమద్ వంటి స్టార్ క్రికెటర్లతో ఈ జట్టు కూడా స్ట్రాంగ్ కనిపిస్తోంది. ఇరుజట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి.
ఇక ఈ మ్యాచ్ కోసం భారీ బధ్రత ఏర్పాట్లు చేశారు. మరోవైపు స్టేడియంలో కొత్తగా అందుబాటు-లోకి వచ్చిన ప్లnడ్ లైట్లు- ప్రేక్షకులకు క్రొత్త అనుభూతిని ఇవ్వనున్నాయి. ఇక స్టేడియం ఆధునీకరణలో భాగంగా బాల్కనీలతో కూడిన కార్పొరేట్ బ్లాక్సులు, ఆ బాక్సులు ఉన్న అంతస్తుల్లోకి వెళ్లేందుకు ప్రత్యేక్షంగా రెండు భారీ లిఫ్ట్‌లు ఏర్పాటు చేశారు. అలాగే ఆట గాళ్ల డ్రెస్సింగ్ రూమ్‌లలో అత్యా ధునిక సదుపాయాలు సమకూర్చా మని నిర్వాహకులు తెలిపారు.
మ్యాచ్‌పై టికెట్ల ధర ప్రభావం!
మ్యాచ్‌కు టికెట్ల ధర ప్రభావం పడిందని అభి ప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. అలాగే కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే టికెట్లు- అమ్మకాలు చేపట్టడం కూడా ప్రభావం చూపిందని వ్యాఖ్య లు వినిపిస్తున్నాయి. ప్రారంభ టికెట్ ధర రూ. 2,200 కావడం క్రీడాభిమానులకు మింగుడు పడటం లేదు. దీంతో ఆదివారం రాత్రి వరకు రూ. 2,200 ధర టికెట్లు- ఆన్‌లైన్‌లో అందుబాటు-లో ఉన్నాయి. అలాగే మిగిలిన రూ. 2,500, రూ. 3,000, రూ. 3,500, రూ. 5,000, రూ.10,000, రూ.15,000 ధర టికెట్లు- లభ్యమవుతున్నాయి.