IPL 2025 | ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసిందోచ్ !!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 18వ సీజన్ పూర్తి షెడ్యూల్ వివరాలు వచ్చాయి. 65 రోజుల పాటు 74 మ్యాచ్‌ల పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించింది బీసీసీఐ. మార్చి 22 నుంచి మే 18 వరకు 70 లీగ్ మ్యాచ్‌లు జరగనుండగా.. మే 20 నుంచి మే 25 వరకు ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

మార్చి 22న ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు… రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఈ మ్యాచ్ కొల్‌కతా వేదికగా జరగనుంది. అదే స్టేడియంలో మే 25న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

ఇక మార్చి 23న రెండు మ్యాచ్‌లు జరగనుండగా.. తొలి మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది. అదే రోజు రెండో మ్యాచ్ సీఎస్‌కే, ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్..

  • రాజస్థాన్‌తో – మార్చి23న‌
  • మార్చి 27న – లఖ్‌నవూతో,
  • మార్చి 30న – దిల్లీ క్యాపిటల్స్,
  • ఏప్రిల్ 3న – కోల్‌కతా నైట్ రైడర్స్ తో,
  • ఏప్రిల్‌ 6న – గుజరాత్‌,
  • ఏప్రిల్ 12 – పంజాబ్‌ కింగ్స్ తో,
  • ఏప్రిల్ 17న – ముంబయి ఇండియన్స్,
  • 23న – ముంబయి ఇండియన్స్,
  • 25న – చెన్నై సూపర్ కింగ్స్,
  • మే 2న – గుజరాత్‌ టైటాన్స్,
  • మే 5న – దిల్లీ క్యాపిటల్స్,
  • మే 10న – కోల్‌కతా,
  • మే 13న – ఆర్సీబీ,
  • మే 18న – లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తో ఆడనుంది.

Leave a Reply