invitation | వరపూజకు రండి

invitation | వరపూజకు రండి
- మంత్రి సీతక్కకు ఆహ్వానం
invitation | ములుగు జిల్లా, మంగపేట, ఆంధ్రప్రభ : జనవరి 15న జరిగే ములుగు జిల్లా, మంగపేట మండలం మల్లూరు శ్రీ హేమాచల క్షేత్రం (మల్లూరు గుట్ట ) పై కొలువై ఉన్న శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి వారి వరపూజ (నిశ్చయ తాంబూల స్వీకరణ) కార్యక్రమానికి రావాలంటూ రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ ( సీతక్క)తో పాటు పలువురు ప్రముఖులకు ఆలయ కార్యనిర్వాహణాధికారి ఆర్.మహేష్ ఆహ్వానించారు. ఈ రోజు మేడారంలో రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ ( సీతక్క ), ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, ములుగు జిల్లా ఎస్పీ.సుధీర్ రామనాథ్ కేకన్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆలయ కార్యనిర్వాహణాధికారి ఆర్.మహేష్, ఆలయ ప్రధాన అర్చకుడు ముక్కామల రాజశేఖర శర్మ తదితరులు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి వారి వరపూజ (నిశ్చయ తాంబూల స్వీకరణ) కార్యక్రమానికి సంబందించిన వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జనవరి 15న మల్లూరులోని సంక్రాంతి మండపం వద్ద జరిగే శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి వారి వరపూజ కార్యక్రమానికి రావాలంటూ వారిని ఆలయ కార్యనిర్వాహణాధికారి ఆర్.మహేష్, ఆలయ ప్రధాన అర్చకుడు ముక్కామల రాజశేఖర శర్మలు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గోనె లక్ష్మీనారాయణ,తదితర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
