ఇన్వెష్టర్లు.. బ్యాంకర్లు క్యూ..బంగారం ధర రాకెట్
ఈ బుల్లీష్ ట్రెండ్ లాంగ్ టర్న్
అమెరికా షట్ డౌన్ వార్నింగ్ ప్రధాన కారణం
( ఆంధ్రప్రభ, బిజినెస్ వెబ్ డెస్క్) భారత బంగారం మార్కెట్ పై అమెరికా ఆర్థిక అనిశ్చితి తీవ్ర ప్రభావం చూపింది. మరో పక్కన పొరుగు దేశాల మధ్య ఘర్షణ, యుద్ధ వాతావారణం జత కలిసింది. అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ హెచ్చరిక.. ప్రపంచంలోని మార్కెట్లన్నీ స్వర్గధామాన్ని అన్వేషిస్తున్న తరుణంలో,,, గోల్డ్ మాత్రమే సేఫ్ హెవెన్ గా మారింది. ఇక ఇదే స్థితిలో దీర్ఘకాలం బుల్లిష్ ట్రెండ్ కొనసాగుతుందని ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఇండియన్ బులియన్ మార్కెట్ సోమవారం 10 గ్రాముల ధరను పదిరూపాయలకు తగ్గించి ట్రేడింగ్ ఎనౌన్స్ చేయగానే.. ఈ రోజు బంగారం ధర తగ్గుతుందని మధ్య తరగతి జీవులు సంబర పడ్డారు. అనూహ్యంగా ప్రపంచ మార్కెట్ బంగారం ధరను గుదిబండలా ప్రయోగించటంతో.. భారత్ లోనూ బంగారం ధర దూసుకుపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.1,370లు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,250లు, 18 క్యారెట్ల బంగారం ధర రూ.1030లు పెరిగాయి. అంటే గడచిన రెండు రోజుల్లో మేరకు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,730లు పెరిగింది. 22 క్యారెట్ల బంగారం అంటే రూ.ధర 4500లు పెరిగింది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.2,050లు పెరిగింది. సోమవారం రాత్రి 9.00 గంటలకు అందిన సమాచారం మేరకు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,20,770లకు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధరూ.1,10,700లకు, 18 క్యారెట్ల బంగారం ధర రూ.90,580లకు పెరిగింది. ఈ ట్రెంబ్ ఇలాగే కొనసాగితే.. దీపావళి నాటికి బంగారం ధర ఏ స్థాయికి చేరుతుందో. అనూహ్యం.
ఏడాదిలోనే ఇంత మార్పా.. వామ్మో
ఈ రోజు రూ.1,20,770లకు బంగారం ధర చేరింది. ఏడాది కిందటి ధరతో పోల్చితే 37 శౄతం పెరిగింది. 2024 అక్టోబర్ 6న భారత బులియన్ మార్కెట్‌లో 24 క్యారట్ బంగారం ధర 10 గ్రాములకు రూ.77,650 నుంచి ₹77,850 మధ్య ఉంది. ముంబై, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో 24 క్యారట్ బంగారం 10 గ్రాములకు రూ. 77,670గా నమోదైంది. 22 క్యారట్ బంగారం ముంబైలో 10 గ్రాములకు రూ.71,200గా ఉంది.
తెరమీదకు నయా డిమాండ్
అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ తో ఆర్థిక అనిశ్చితి తప్పని స్థితిలో ప్రపంచ వ్యాప్తంగా సేఫ్ -హేవెన్ కోసం వెతుక్కునే స్థితి ఏర్నడింది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థపై జీడీపీ ప్రభావం తప్పదని భయం పెరిగింది. ఇక ఫెడరల్ రిజర్వ్ రేట్ కట్ అంచనాలూ ఆందోళనకరంగా మారాయి. అక్టోబర్‌లో 25 బేసిస్ పాయింట్లు, డిసెంబర్‌లో మరోసారి రేట్ కట్ చేసే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే జరిగితే వడ్డీ రేట్లు తగ్గటంతో బంగారం డిమాండ్ పెరుగుతుంది. ఇక అమెరికా డాలర్ క్షీణించింది. భారతీయ రూపాయి మూల్యం తగ్గడంతో భారత మార్కెట్‌లో ధరలు పెరిగాయి.
సేఫ్ హెవెన్ వైపే దృష్టి..
సెంట్రల్ బ్యాంక్ బంగారం కొనుగోళ్లు, గోల్డ్-బ్యాక్డ్ ఈటీఎఫ్ లు , రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య పెరిగింది. . 2025లో 49% పెరిగింది, అంతర్జాతీయ రాజకీయ, టారిఫ్ వార్ , జియోపాలిటికల్ టెన్షన్లు సేఫ్-హేవెన్ కోసం వెతుకుతున్న స్థితిలో బంగారం అగ్రస్థానంలోకి వచ్చింది. బంగారం ఇన్వెస్టర్లు, హోల్డర్లకు లాభం పెరిగింది. ఈ ఏడాది 50% పైగా లాభం లభించనట్టు అంచనా. ఇక భారతదేశంలో జ్యువెలరీ కొనుగోళ్లు, పండుగల సమయంలో ధరలు పెరగటంతో డిమాండ్ తగ్గుతుంది. గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి సిగ్నల్ తో , రికెషన్ భయాలు పెరుగుతాయి.
నగరం 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ 18 క్యారెట్స్
హైదరాబాద్ రూ.1,20,770 లు రూ.1,10,700 లు రూ.90,580లు
వరంగల్ రూ.1,20,770 లు రూ.1,10,700 లు రూ.90,580లు
విజయవాడ రూ.1,20,770 లు రూ.1,10,700 లు రూ.90,580లు
గుంటూరు రూ.1,20,770 లు రూ.1,10,700 లు రూ.90,580లు
విశాఖపట్నం రూ.1,20,770 లు రూ.1,10,700 లు రూ.90,580లు
చెన్నై రూ.1,20,770 లు రూ.1,10,700 లు రూ.90,580లు
కోల్కత్త రూ.1,20,770 లు రూ.1,10,700 లు రూ.90,580లు
ముంబై రూ. రూ.1,20,770 లు రూ.1,10,700 లు రూ.90,580లు
ఢిల్లీ రూ.1,20,920లు రూ.1,10,850లు రూ.90,730లు బెంగళూరు రూ.1,20,770 లు రూ.1,10,700 లు రూ.90,580లు
కేరళ రూ.1,20,770 లు రూ.1,10,700 లు రూ.90,580లు
అహ్మదబాద్ రూ.1,20,820లు రూ.1,09,490లు రూ.89,590లు
వడోదర రూ.1,20,820లు రూ.1,09,490లు రూ.89,590లు