ఇసుకదేశంలో ఆర్థిక సంపద, అభివృద్ధికి బాసట
భారత యువశక్తికి అక్కడు మెరుగైన అవకాశాలు
ఆ అభివృద్ధి అమరావతికి కావాలి..
ఎపిలో పెట్టుబడులు పెట్టండి..సింగిల్ క్లిక్ తో అనుమతులిస్తాం
ఇన్వెస్టోపియా గ్లోబల్ సమ్మిట్ లో చంద్రబాబు
విజయవాడ – ఆలోచనలు ప్రత్యేకంగా ఉన్నప్పుడే మనం ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. 1.1 కోట్ల మంది యూఏఈ జనాభాలో 40 శాతం మంది ఇండియన్స్ ఉన్నారు.. వారి ద్వారా కూడా యూఏఈలో అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. విజయవాడలో నేడు ప్రారంభమైన ఇన్వెస్టోపియా గ్లోబల్ సమ్మిట్ లో ఆయన మాట్లాడుతూ, తాను జనవరిలో అబ్దులా బిన్ ను కలిసాను అప్పుడు ముందుగా ఏపీకి రావాలని కోరానన్నారు.. ఏపీ గురించి మీకు అప్పుడే అర్థమవుతుందని చెప్పా.. ఇచ్చిన మాట ప్రకారం ఆయన తొలుత ఆంధ్రప్రదేశ్ కే వచ్చారని గుర్తు చేశారు. యూఏఈని ఓ దేశంగా చూస్తే ప్రతి దేశానికి కొన్ని అడ్వంటేజ్స్ ఉంటాయని అంటూ దుబాయ్ ప్రాంతంలో 50 డిగ్రీల టెంపరేచర్ ఉన్నా.. ఎడారి ఉన్నా ఆ ప్రాంతాన్ని వారు స్వర్గంలా మార్చారని వివరించారు.. అక్కడి అభివృద్ధిని చూశానన్నారు. ఇక, వారు ఇంటర్నెట్ సిటీ పెడితే, నేను హైటెక్ సిటీ కట్టానని పేర్కొన్నారు.. 2021లో మనం కరోనా వల్ల భయపడ్డాం ఆ సమయంలో యూఏఈ ఇస్టోపియాను తీసుకువచ్చారు అని చంద్రబాబు చెప్పారు.
విదేశాలలో మన మానవ శక్తికి ఎక్కువ అవకాశాలు
ఆ దేశంలోనూ మనకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయన్నారు.. ఇండియాను ఎవ్వరు వ్యాపారపరంగా విస్మరించలేరన్నారు. .. డెమెగ్రఫిక్ డివిడెంట్ కేవలం ఇండియాకు మాత్రమే ఉందని పేర్కొన్నారు చంద్రబాబు .. చాలా దేశాలు ఏజింగ్ ప్లాబ్లంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు..అయితే భారత్ కు ఆ బెడద లేదన్నారు… ఇండియాలో రైట్ టైం రైట్ ప్లేస్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారని చెప్పారు.. 2024-25లో 100 బిలియన్ యూఎస్ డాలర్ల వ్యాపారం యూఏఈకి ఇండియాకు మధ్య జరిగింది అన్నారు. గత పదేళ్లగా 11 స్థానం నుంచి 4వ స్థానానికి భారత్ చేరుకుందని సీఎం చంద్రబాబు తెలిపారు.

2047కి భారత్ నెంబర్ వన్ ..
ఇక, 2047కి ఇండియా ప్రపంచంలోనే నెంబర్ 1 అవుతుందని ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు.. ఆ దిశగా తాము ప్రయత్నం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి మొదటి క్వంటం కంప్యూటింగ్ ఏపి నుంచి పని చేస్తుందన్నారు. 575 సర్వీసులు ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇస్తున్నామని చెప్పారు.. ఆగష్టు 15 నాటికి ఈ సంఖ్య 100 శాతానికి చేరుతుందని పేర్కొన్నారు. విదేశీయులు ఇండియాలో పెట్టుబడులు పెడితే అన్ని అనుమతులు ఆన్ లైన్ ద్వారా ఇస్తామని చెప్పారు.. అనుమతులకోసం ఏ ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదని, .. మా హ్యాండ్ హోల్డింగ్ ఉంటుందని చెప్పారు. ..
రాష్ట్రంలో పేదలను పైకి తెచ్చేందుకు పీ4ను తీసుకువచ్చామని దీని ద్వారా .. 100 శాతం పేదరిక నిర్మూలను మా లక్ష్యమన్నారు. .. దుబాయ్, యూఏఈ ప్రభుత్వాలు ఈ విషయంలో చాలా బాగా చేశాయని ప్రశంసించారు.. లులూకు ఎంతో డిమాండ్ ఉందని, . ఆయన కొచ్చి వచ్చి షాపింగ్ మాల్ చూడాలిని అడిగారన్నారు.. వాటిని చూసిన తర్వాత విశాఖతో పాటు విజయవాడ, అమరావతిలో కూడా హైపర్ మాల్ పెట్టాలని ఆయనను కోరానని చెప్పారు.. సంపద సృష్టిలో పెట్టుబడిదారుల పాత్ర ఎంతో ముఖ్యం అని ముఖ్యమంత్రి తెలిపారు.