క్లూస్ టీంతో దర్యాప్తు
లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా(Nirmal District) లక్ష్మణచాంద మండలంలోని కంజర్ గ్రామంలొ మహలక్ష్మి, ముత్యాలమ్మ(Mahalaxmi, Muthyalamma) ఆలయాలలో మంగళవారం అర్ధరాత్రి విగ్రహాల చోరి జరిగిన సంఘటన ఈ రోజు ఉదయం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు ఇచ్చిన పిర్యాదు మెరకు ఎస్ ఐ శ్రీనివాస్(SI Srinivas) సంఘటన స్తలానికి వెళ్లి క్లూస్ టీంతొ ధర్యాప్తు చేపట్టారు.
అపహరించిన విగ్రహాలు ఆలయ సమీపంలొ విసిరివేయగా వాటిని తీసుకొచ్చి బద్రపరిచారు. విగ్రహల విషయంలో గ్రామస్తులు ఆందోళన చెందారు. అలాగే ఆలయాలలో క్షుద్ర పూజలు జరిగినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. స్తానిక నాయకులు నల్ల లక్ష్మారెడ్డి(Nalla Lakshma Reddy) ఇతర గ్రామాభివృద్ది కమిటీ సబ్యులతో చర్చించి ఎస్సై శ్రీనివాస్ వారిని శాంత పరిచారు. ఐపీసీ 380,457 సెక్షన్(IPC Section 380,457)లు, భారత న్యాయ సంహిత 305,331(4) ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలొ స్తానికులు మోహన్ రెడ్డి, విడీసీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
